రాష్ట్రీయం

వర్థీ బీడీలతో బహుముఖ దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఫిబ్రవరి 14: సెంట్రల్ ఎక్సైజ్, సేల్‌టాక్స్ అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు ఖజానా సమకూరాల్సిన రోజుకు రూ. 3కోట్లు, నెలకు 90 కోట్ల పన్ను వర్థీబీడీ వ్యాపారుల వల్ల గండిపడుతోంది. ఆదాయ పెంపుకోసం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రభుత్వం సమర్థత వసూళ్లకు పూనుకోకపోవడంతో ఒక్క వర్థీ బీడీతోనే నెలకు రూ.90కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో బీడీ పరిశ్రమ వేళ్లూనుకుని ఉండగా దాదాపు 8 లక్షల కార్మికులుకు బీడీ పరిశ్రమే ఉపాధి కల్పిస్తోంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో బీడీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. అనేకమంది కార్మికులకు గుర్తింపు కార్డులు లేవు. అధికారిక లెక్కల ప్రకారం బీడీ కార్మిక సంఖ్య 3 లక్షలకు మించి లేదు. కానీ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనే 6 లక్షల ఉన్నట్లు కార్మిక సంఘాలు చెబుతుండగా ఆ సంఖ్య లక్షన్నరలోపేనని అధికార వర్గాలు అంటున్నాయి. ఒక్కో బీడీ కార్మికుడు సగటున వెయ్యి బీడీలు తయారు చేస్తుండగా ఈ లెక్కన ప్రతిరోజు 120 కోట్ల బీడీల ఉత్పత్తి అవుతుంది. అధికారికంగా బీడీ కార్మికులు తయారు చేసిన బీడీలు లెక్కల్లో చూపిస్తూ మిగతా బీడీలకు, గుర్తింపు పొందని కార్మికులచే జీరోలో అమ్ముతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పెద్దకంపెనీల్లో పనిచేసే మేనేజర్లు, ఉద్యోగులు రిజిస్ట్రేషన్ కాని ఎన్నో సంస్థలు ఈ వర్థీ బీడీలు తయారు చేయించి బస్సులు, రైళ్లల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. వెయ్యి బీడీలకు కిలో తునికాకు అవసరం కాగా కిలో రూ. 50 చొప్పున లెక్కించినా 2.5 కోట్ల తునికాకు అవసరం. తునికాకు అమ్మకంపై 10శాతం వాణిజ్య పన్ను వసూలు చేస్తోంది. పన్ను ఎగవేత ప్రభుత్వానికి నష్టం కాగా 6లక్షల కార్మికులకు దినసరి కూలీలో అతితక్కువ చెల్లిస్తూ ఎక్కువ లాభాలు వ్యాపారులు ఆర్జిస్తూ కార్మికుల పొట్టలు కొట్టి కోట్లు గడిస్తున్నారనే ఆరోపిస్తున్నాయి.