ఆంధ్రప్రదేశ్‌

వాద్యకారులకు ప్రోత్సాహం కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: వాద్యకారులకు విదేశాల్లో ఆదరణ పెరుగుతుంటే, మన దేశంలో తగ్గిందని కళామామణి, సంగీత కళాకారిణి, పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఎయు సంగీత విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీతానికి ఎంతో శక్తి ఉందని, వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఉందన్నారు. అయితే మన దేశంలో వాద్యకారులకు తగినంత ప్రోత్సాహం అందడం లేదన్నారు. విదేశాలలో వాద్యకారులకు ఆదరణ ఎక్కువగా ఉందన్నారు. ఏకాగ్రతతోనే సంగీత సాధన సాధ్యపడుతుందని, దానికి ఓర్పు, పట్టుదల ఉండాలన్నారు. సంగీతంలో కనీసం ఆరేళ్లు సాధన చేయగలిగినపుడే కచేరీలు ఇవ్వగలరన్నారు. గురువును పొందడం ఎంతో కష్టమని, తన అభివృద్ధికి గురువులు మార్గదర్శకులుగా నిలిచారన్నారు. తనకు విద్యను అందించిన గురువులను ఆజన్మాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. నేటి తరం యువత కూడా తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకొని నిరంతర సాధన చేయాలన్నారు.