తెలంగాణ

విద్యుత్ కాంతులతో జిగేల్‌మంటున్న మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 15: పున్నమి వెనె్నల్లో మేడారం పులకించిపోతోంది. మహాజాతరకు ఒక రోజే సమయం ఉండడంతో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. సోమవారం దాదాపు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాకతీయ సేనలపై కత్తి ఝుళిపించిన వీరవనితలు సమ్మక్క - సారలమ్మ జాతర కోసం కొలువుదీరే అపురూప క్షణాలు మరో 24 గంటల్లో రానున్నాయి. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు విధుల్లో చేరిపోయారు. పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ జీవన్‌పాటిల్ గత రెండు రోజులుగా మేడారంలోనే తిష్టవేసి జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జంపన్నవాగు భక్తులతో కిటకిటలాడుతుంది. తమ కష్టాలు తీర్చే అమ్మలగన్న అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్తజనంతో దట్టమైన కీకారణ్యం జన గుడారమైంది. తల్లుల గద్దెలకు 5 కిలోమీటర్ల దూరం నుండే పోలీసులు భక్తులను నిలిపివేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాజాతర ప్రధాన ఘట్టానికి బుధవారం శ్రీకారం చుట్టబోతోంది. ఎదనిండా గూడుకట్టుకున్న భక్తివిశ్వాసాలతో మమ్ముల సల్లంగా సూడు తల్లీ అంటూ భక్తజనం పారవశ్యం చెందుతున్న జాతర ఉత్సవ సంరంభం కాబోతోంది. జాతర సమయం దగ్గరపడుతున్నకొద్దీ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మేడారం జాతరకు ముందే భక్తజనం ముందస్తుగానే పోటెత్తుతోంది. కనె్నపెల్లి నుండి సారలమ్మ ఈ నెల 17న గద్దెపైకి రానుంది. 18న చిలుకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. 19న దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. తిరిగి 20న వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.