విండో

విండో

  • -వి.ఆర్.సి.మూర్తి
  • 10/03/2012

ఆలోచనలను పసిగట్టే కంప్యూటర్
మనిషి ఆలోచనలో కంప్యూటర్‌ను శాసించడం మాట ఎలా ఉన్నా, కంప్యూటర్ ముందు కూర్చుని కీబోర్డుపై పనులు చేస్తూ వెళ్లే మనిషి ఆలోచనలను పసిగడుతుందని వాషింగ్టన్‌లో శాస్తవ్రేత్తలు సూత్రప్రాయంగా ప్రదర్శించి చూపారు. ఇందుకు కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపకల్పనకు స్థానిక రెండు విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందాలు చేసిన పరిశోధన ఫలితాలను వారు వివరించారు. కంప్యూటర్ ముందు విసుగు ప్రదర్శించినా, సరిగా స్పందించకపోయినా పసిగట్టే సాఫ్ట్‌వేర్‌ను హార్డ్‌వేర్‌తో జోడించిన వైనాన్ని వారు వివరించారు. ఈ పరిశోధనలో మెంఫిస్, నోట్రే డెమ్ వర్శిటీ విద్యార్థుల పరిశోధనలకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ తోడ్పడిన విషయాన్ని వారు తెలిపారు. ఇప్పటివరకు మానవ మేధస్సుపై జరుగుతున్న పరిశోధన చేస్తున్న పలు అంశాలను వివరిస్తూ, సాఫ్ట్‌వేర్ - హార్డ్ పనితీరును వారు వివరించారు. ముందుగా విద్యార్థులలో విజ్ఞాన సముపార్జన అందించే క్రమంలో కంప్యూటర్ ఆటో ట్యూటర్ ఉపయోగపడుతుందని వారు వివరించారు. ఇప్పటివరకు విద్యాధ్యయనానికి చైనా, జపాన్, అమెరికాలోని వివిధ కంపెనీలు వివిధ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఒక అంశాన్ని అవగాహన చేసుకోవాలంటే అందుకు సంబంధించిన అంశాన్ని ప్రత్యక్షంగా విద్యార్థి చూడగలిగినప్పుడే విషయ అవగాహన సాధ్యం అన్నది సాధ్యమని, ఈ క్రమంలో వివిధ కంపెనీలు విద్యాసంబంధ కంప్యూటర్ పెరిఫిరల్స్‌ను ఎప్పటికప్పుడు కొత్త వాటిని అందిస్తున్నాయి. ఆదిలో చిన్నపిల్లలను ఆటపాటలతో విద్యార్జనకు ఆకర్షితులను చేయడానికి పలు పరికరాలను ఉత్పత్తి చేశారు. హార్డ్‌వేర్‌కు సాఫ్ట్‌వేర్‌ను జోడించి ఆలోచనా శక్తికి పదను పెట్టే క్రమంలో ఉత్పత్తులు ప్రారంభించారు. మరింత మెరుగైన ఫలితాలను సాధించాలంటే మనిషి ఆలోచనలను పసిగట్టాలని అలాగే భావోద్వేగాలు, స్పందనలు కంప్యూటర్ గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించాలన్న ఆలోచన బయలు దేరింది. ఈ ఆలోచనలో భాగంగానే తొలుత నోట్రే డెమ్‌లో విద్యార్థులు ఈ పరిశోధనలకు శాస్తవ్రేత్తలు పురికొల్పారు. ఇందుకు వలసిన వౌలిక సదుపాయాల కల్పనకు మసాచుసెట్స్ ముందుకు వచ్చింది. కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాలను సమకూర్చింది. విద్యాబోధనకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆటో ట్యూటర్‌ల ఆధారంగా పరిశోధనలు జరిగాయి. ఒక ప్రశ్నను సంధించినప్పుడు వెంటనే సమాధానం కంప్యూటర్ ద్వారా రాబట్టగలిగినప్పుడు మనిషిని పరికరాలు అర్ధం చేసుకోగలిగితే వారిని విద్యాబోధనకు అనుకూలంగా మలుచుకోడానికి కంప్యూటర్లు అర్థం చేసుకోవాలి. ఇందుకోసం కెమెరా కనులతో కంప్యూటర్ ముందు కూర్చున్న వ్యక్తిని గమనించి ఆలోచనలను, ఉద్వేగాలను పసిగట్టే విధంగా ప్రాథమికంగా మలిచారు. సాధారణంగా నేరుగా ఒక పాఠ్యపుస్తకంద్వారా తెలివైన విద్యార్థి అవగాహన చేసుకున్న దానికంటే సాధారణ విద్యార్థిఆలోచనలను గుర్తించి, విద్యార్థి ఆలోచనలకు అనుగుణంగా బోధన చేసి మెరుగైన అవగాహన కలిగించే అంశాన్ని పరీక్షించి చూశారు. తక్కువ మార్కులు వచ్చే సాధారణ విద్యార్థిని మొదటి శ్రేణిలో ఆలోచించే విద్యార్థిగా తీర్చిదిద్దే వీలు ఈ సరికొత్త పరిశోధనల ద్వారా కలుగుతుందని వాషింగ్టన్‌లో జరిగిన గోష్ఠిలో అమెరికన్ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
సాంసంగ్, ఆపిల్ ఆధపత్యపోరు
స్మాట్‌ఫోన్, ట్యాబ్‌లెట్‌లను అందించే రెండు కంపెనీల మధ్య ఆధిపత్యపోరును కోర్టు త్రోసిపుచ్చింది. పేటెంట్ హక్కులను కాలరాసి ఉత్పత్తులు అందిస్తున్నారని ఆపిల్ ఆరోపిస్తే, టెక్నాలజీ విషయంలో పోటీని ఆహ్వానించాల్సిందే అంటూ యూరోపియన్ యూనియన్ కోర్టుముందు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. స్మాట్ ఫోన్‌కు జీవం కలిగిస్తున్న టచ్‌స్క్రీన్, వైర్లెస్, సరికొత్త అప్లికేషన్లు ఒకేమాదిరి ఉండటం, మొబైల్స్ మెయిల్స్ సక్రమంగా అందుకోవాలంటే పుష్ టెక్నాలజీ తప్పనిసరి. ఈ విషయంలో ముందుగా ఇలాంటి టెక్నాలజీ అందించిన ఆపిల్ వాటి పేటెంట్ హక్కులు తమవేనంటూ వాదించింది. పరిశోధనాపరమైన విషయాలను దృష్టిలోపెట్టుకుని కోర్టు ఈ విషయంలో వాదప్రతివాదనలు విన్నతరువాత పరస్పర ఆరోపణల అంశాన్ని త్రోసిపుచ్చింది. వాస్తవానికి వస్తే యూరోపియన్ యూనియన్‌లో జర్మనీ కోర్టు తీర్పు మరికొన్ని దేశాలలో టెక్నాలజీ హక్కుల విషయంలో కొత్త వివాదాలుకు తెరతీస్తుంది. ట్యాబ్‌లెట్, స్మాట్ ఫోన్ ఉత్పత్తి సేవల విషయంలో ఆపిల్‌కు శాంసుంగ్ గట్టిపోటీనిస్తోంది. ఇది ఇలా ఉంటే అమెరికాలో తాజా వివాదం బయలు దేరింది. ఐ-్ఫన్‌లో లోకల్ టివి ప్రసారాలను తిలకించే అప్లికేషన్‌ను జోడించడంతో ప్రసార కంపెనీలు కేసు నమోదు చేశాయి. ఆపిల్‌కు వ్యతిరేకంగా ఎబిసి, సిబిఎస్, ఎన్‌బిసి, ఫాక్స్ తదితర కంపెనీలు కేసు దాఖలు చేశాయి.
ఉచితంగా విండోస్ 8 టెస్ట్ వర్షన్
మైక్రాసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ టెస్ట్ వర్షన్ ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఉచితంగా వినియోగదారులకు అందజేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన వినియోగదారులకు దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించడంలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించడానికి వీలుగా వినియోగదారులకు అందజేశారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ పనితీరులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఒక స్టార్ట్ అప్ లేకపోవడంవల్ల అందులో జోడించే సాఫ్ట్‌వేర్ వాటి రన్ విధానంలో మార్పు రావడంవల్ల కంప్యూటర్ ఆన్‌చేయగానే కొద్ది సెకన్లలోనే పనిచేయడం ప్రారంభిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ ఐకాన్స్ అన్నీ డెస్క్‌టాప్‌పైనే కనిపించడంవల్ల పనితీరు మరింత సులభం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం నమోదు చేసుకున్నవారికి బుధవారం మైక్రోసాఫ్ట్ అందజేసింది. నిర్ణీత వ్యవధిలో ఆపరేటింగ్ సిస్టమ్స్ పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికను మైక్రోసాఫ్ట్‌కు కొత్త ఒఎస్‌ను ఉపయోగిస్తున్నవారు అందజేస్తారు. అనుకున్న లక్ష్యానికి ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. విండోస్ 7 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాదిరిగానే విండోస్ 8 ఉండదని వెబ్‌లో యూజర్లు పోస్టింగ్ చేస్తున్నారు.
హ్యాకింగ్‌లో రికార్డు
అమెరికా అత్యంత ప్రతిష్ఠాకరంగా భావించే నాసా వెబ్‌సైట్‌ను రికార్డు స్థాయిలో గత సంవత్సరం హాకింగ్ చేయడం ఆందోళనకు గురిచేస్తుంది. వెబ్‌సైట్ హాక్‌కు గురైన అంశాన్ని స్వయంగా నాసా ప్రకటించింది. సుమారు 13 మార్లు హాక్ జరిగినట్లు యుఎస్ నేషనల్ సెక్యూరిటీకి వెల్లడించింది. ఇంటర్‌నెట్ ప్రోటోకాల్స్ ఆధారంగా చైనానుంచి హాకింగ్ జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా గ్రహ గమనాలు, వాటికి ఉపరితల పరిశోధన అంశాలను కూడా హాకర్లు చూసి ఉంటారని భావిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో ఉన్న 23 అంతరిక్ష నౌకలు అంగారకుడు, శని తదితర గ్రహాల గమనాలను విశే్లషిస్తున్నాయి. ఈ సందర్భంలో హాకర్లు సంబంధిత సమాచారాలను కాపీ చేసుకోడం, మార్చడం లాంటి చర్యలకు పాల్పడినట్లు కనుగొన్నారు. చైనా హాకర్లు ఏ సమాచారం కోసం సైట్ హాక్ చేశారో పూర్తిగా విశే్లషించలేకపోయారు. అయితే ఇకముందు హాకర్లకు సమాచారం చిక్కకుండా నాసా వెబ్‌సెంటర్ హాక్‌కు గురికాకుండా తగు భద్రతా చర్యలను తీసుకున్నట్లు ప్రకటించారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading