'క్లాప్' కొట్టు గురూ!

ఊహించని పాత్రలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రేజీ స్టార్ అనుష్క ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించుకుంటోందని.. త్వరలోనే పెళ్లి కూతురు కానుందని... అందుకే ఇలా సినిమాలు తగ్గించుకుంటోందని తెలుగు చిత్రసీమలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటివి అనుష్కకు ఇప్పుడు కొత్తేం కాకపోయినా, ఈ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎంతో తెలివిగా వాటిని తేలిగ్గా కొట్టిపారేస్తూనే వుంది. ఈ విషయం గురించి పదే పదే కలిసిన చోటల్లా మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నలు గుప్పిస్తుంటే తను మాత్రం ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ రొటీన్ తరహాలోనే జారుకుంటూనే వుంది. అయితే.. ఇక ఇలాంటి రూమర్స్‌కి తావివ్వకుండా ఈ మధ్య తెగ సందడి చేస్తూ అందరితో మనసువిప్పి మాట్లాడుతోందిట. అనుష్కలో వచ్చిన మార్పు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుందట. ‘‘నాకంటూ ఎలాంటి కోరికలూ లేవు. ఫలానా క్యారెక్టర్ చేయాలి. ఫలానా కథలో నటించాలనుకోను. కానీ మా అమ్మకు మాత్రం నన్ను ఎన్నో రకాల పాత్రల్లో చూడాలని ఉంది. నా కెరీర్‌లో ఊహించని క్యారెక్టర్స్ ఎన్నో నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే వాటిని నేనేం కోరుకోలేదు. తరుచూ మా అమ్మ నన్ను యువరాణిలాంటి పాత్రల్లో చూడాలని ఉంది అని చెబుతుండేది. అదేంటో అమ్మ ఏం అనుకొంటే అదే జరిగిపోతుండేది. నాకు వింతగా అనిపించేది. అందుకే ‘రుద్రమదేవి’, ‘అరుంధతి’లాంటి చిత్రాల్లో అమ్మ కోరుకున్న యువరాణి పాత్రల్లో మెరిసిపోయా. ఇక పెళ్లి..పెళ్లి.. అంటూ మీడియా నన్ను కలిసిన చోటల్లా పదే పదే ప్రశ్నిస్తోంది. ఏవీ మనం అనుకుంటే జరగవు. కొన్ని ఎప్పుడు జరగాలో రాసిపెట్టి ఉంటాయి. ఆరోజు కోసం వేచిచూద్దాం. ఎలా జరగాలో.. ఎప్పుడు జరగాలో.. ఏమో? మనకు తెలియదు’’అంటూ మళ్లీ చెప్పిందే చెప్పి తెలివిగా తప్పించుకుందట. అదీ..సంగతీ! దటీజ్..అనుష్క!

సమీర్