విజయనగరం

డాక్టర్ సూర్యనారాయణకు స్కూల్ సైకాలజీ విశిష్ట పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 22: ప్రముఖ సైకాలజిస్ట్ ఎయు విద్యావిభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. మనోవైజ్ఞానిక రంగానికి చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా 2016 సంవత్సరానికి న్యూఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్(ఇన్‌స్పా), పికె సుబ్బరాజ్ మెమోరియల్-టెస్ట్ పెర్మార్మన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును పాండిచ్చేరిలో అక్టోబర్ 13వతేదీన జరిగే అంతర్జాతీయ మనోవైజ్ఞానికుల సదస్సులో బహుకరిస్తామని ఇన్‌స్మా సెక్రటరీ ప్రొఫెసర్ పి.రామలింగం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశ, విదేశాలలో ఎంతోమంది మనోవైజ్ఞానికులు ఉన్న ఇన్‌స్పా సంస్థ మనోవైజ్ఞానిక రంగంలో చేసిన కృషిని, పరిశోధనలను, సేవలను గుర్తించి అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందం గా ఉందన్నారు. ఈ అవార్డు రావడం ద్వారా సైకాలజీలో మరింత కృషికి పరిశోధనా బాధ్యతలను పెంచిందన్నారు. ఈ అవార్డుకు డాక్టర్ సూర్యనారాయణ ఎం పిక కావడం పట్ల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎయు ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ డాక్టర్ జి.యోహాన్‌బాబు, ప్రొఫెసర్ బి.నారాయణమూర్తి, ప్రొఫెసర్ సుబ్బారావు, ప్రొఫెసర్ ఉదయగిరి నాగేశ్వరరావు అభినందించారు.