AADIVAVRAM - Others

ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ్ధర్‌రావు (కర్నూలు)
ప్రశ్న: మేం హోటల్ నడుపుతున్నాం. కానీ అనుకున్నంత వ్యాపారం జరగడంలేదు. ఎందువల్లనో అర్థం కావడంలేదు.
జ: మీరు వ్యాపారం నిర్వహిస్తున్న స్థలానికి సంబంధించి కొన్ని దోషాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకొంటే - మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.
పద్మావతి (హయత్‌నగర్)
ప్రశ్న: మా స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. కానీ వస్తున్నారు చూస్తున్నారు వెళ్లిపోతున్నారు. ఎవరూ కొనడానికి ముందుకు రావడంలేదు.
జ: మీ స్థలానికి కొన్ని దోషాలు ఉన్నాయి. అందువల్లనే మీ స్థలం అమ్ముడు కావడంలేదు. దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు. నివారణ చేసుకొన్నట్లయితే - మీ స్థలం అమ్ముడవుతుంది.
సుబ్బారెడ్డి (నిజామాబాద్)
ప్రశ్న: కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాం. దీనికి తూర్పున రోడ్డు ఉన్నది. కానీ మెట్ల నిర్మాణం సమయంలో మెట్లను తూర్పు ప్రహరీ గోడకు ఆనించి నిర్మాణం చేయవచ్చా? చేస్తే ఏమైనా దోషమా?
జ: చాలామంది చేస్తున్న తప్పు ఇదే. మెట్ల నిర్మాణం చేసేటప్పుడు ఎలివేషన్ కోసం అని మెట్లను ప్రహరీ గోడకు ఆనించి నిర్మాణం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ దిశలోగల ‘మూల’ అనగా.. ఉదా: మీరు నిర్మిస్తున్న మెట్లు తూర్పు ఆగ్నేయంలో కలలవు. దీనివల్ల మీ ఇంటికి తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. అలాగే దక్షిణ నైరుతి, పడమర నైరుతి, ఉత్తర వాయవ్యంలో మెట్లు అయితే ఆ దిశలలో ఆ మూలలు పెరగడం జరుగుతుంది. వీటివల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇక మీ ఇంటి విషయానికి వస్తే మీ ఇంటికి తూర్పు ఆగ్నేయం పెరగడం వలన ఇంట్లో నివసించే ఆడవారికి సమస్యలు వస్తాయి. అలాగే దొంగల భయం, కేసులు కూడా ఉంటాయి. కాబట్టి తూర్పు ప్రహరీ గోడకు తగలకుండా మెట్ల నిర్మాణం చేయడం మంచిది. మీకు అంతా మంచి జరుగుతుంది.
విజయ (ఒంగోలు)
ప్రశ్న: ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేశాం. అప్పట్నుంచీ అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఒకటి తీరితే మరొకటి. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నది?
జ: ప్లాన్ ప్రకారం నైరుతి మూలలో టాయిలెట్స్ నిర్మాణం చేశారు. అలాగే ఆగ్నేయం మూలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు. ఈ రెండు దోషాలతోపాటు మెట్ల కిందనే వాయవ్యం మూలలో టాయిలెట్ నిర్మాణం కూడా చేశారు. వీటివల్లనే మీకు ఇలా జరుగుతున్నది. ముందుగా నైరుతి టాయిలెట్, ఆగ్నేయంలోగల సెప్టిక్ ట్యాంక్, మెట్ల కింద ఉన్న టాయిలెట్స్‌ను తీసివేయండి. మీకుగల సమస్యలు తీరిపోతాయి. టాయిలెట్ నిర్మాణం ఎక్కడ చేయాలన్న దానికి సంప్రదించండి.
సిద్దార్థ (వైజాగ్)
ప్రశ్న: ఇటీవల ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాం. చాలామంది వస్తున్నారు చూసి పోతున్నారు. అద్దెకు ఎవరూ రావడం లేదు. దీనికి పరిష్కారం.
జ: ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌కి ఉత్తర వాయవ్యంలో దోషాలు ఉన్నాయి. అలాగే నైరుతిలో కూడా. అందువల్లనే ఇలా జరుగుతున్నది. ముందుగా ఆ దోష నివారణ చేసుకోండి. మీ కాంప్లెక్స్‌లోకి అద్దెకు వస్తారు.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28