జాతీయ వార్తలు

రాజకీయాల్లోకి వస్తానేమో?: రాబర్ట్ వాద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాజకీయాల్లోకి రానని తాను ఎప్పుడూ చెప్పలేదని, ఆత్మసాక్షి చెబితే రాజకీయాల్లోకి వస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా గురువారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ దేశాన్ని విడిచిపెట్టే అవసరం రాదని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లనైనా తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. ‘సంతృప్తికరంగా బతకడానికి నా తండ్రి ఎంతో సంపదను, సామర్ధ్యాలను ఇచ్చారు.. నేను జీవితంలో ఇంకా ఎదగాలంటే నా భార్య ప్రియాంక పేరును ఉపయోగించాల్సిన అవసరం లేదు.. ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పని నాకు లేదు.. రాజకీయ నాయకులు యువతకు ఎపుడూ హితవులు చెప్పడం కాదు, యువత చెప్పింది కూడా వారు వినాలి’- అని వాద్రా తన మనసులోని మాటలను బహిర్గతం చేశారు.