నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. ఆ శమీకుపుత్త్రుఁ డంబుజసంభవు
గుఱిచి భక్తితోడ ఘోర తపము
సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగి య
న్వాఁడు భృంగి సముఁడవంధ్యకోపి
భావం: పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్లివేటాడుతూ అలసిపోయి, తన చేతిబాణపు దెబ్బ తిని పరుగెత్తుతూ వెళ్లిన జంతువును వెదుకుతూ వెళ్లి ఒకచోట తపస్సులో లీనమయిన శమీకుడను మునిని చూచి తన దెబ్బతిన్న మృగాన్ని చూసి ఉంటే చెప్పుమని అడిగాడు. కాని ఆ శమీకుడు తపస్సులో మునిగి వచ్చినది ఎవరనియు, తనను అడుగుతున్నారనియు కూడా తెలియక వౌనంగా ఉండిపోయాడు. ఎంతకీ సమాధానం ఇవ్వని మునిని చూచి దాహంతో ఉన్న పరీక్షిత్తు కోపంతో రగిలిపోయి అక్కడే చచ్చిపడి ఉన్న పామును తన వింటికొనచే ఎత్తి ఆ ముని మెడలో వేసి వెనుతిరిగి వెళ్లిపోయాడు. ఇక అపుడు తన శమీకుడునే ముని కుమారుడు తన తండ్రి చెంతకు వచ్చి జరిగిన విషయాన్ని చూచాడు. తన తండ్రిమెడలో పాముయొక్క కళేబరాన్ని అంటేట్లు చేసి దర్పంతో పరీక్షిన్మహారాజు వెళ్లటం కృశుడనే ముని వలన తెలిసికొని కోపంతో జ్వలించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము