నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. సంచిత పుణ్యుఁ డంబరు హసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁడైన వాఁడు నిఖిలాగమ పుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమ వేద మై పరఁగు భారత సంహిత ఁ జేసి నున్నతిన్

భావం : పుణ్యనిధియున్నూ , బ్రహ్మ అంశాన జన్మించిన లోక పూజ్యుడున్నూ అయినట్టి ఆ కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభాగించి వాటిని లోకంలో ప్రశస్తం కావించి విశ్వశ్రేయస్సుకై పంచమ వేద మని ప్రసిద్ధి చెందిన ఈ భారత సంహితను రచించాడు. తపోభూమికి వెళ్లిన వ్యాసుడీవిధంగా చేయగా, భారతయుద్ధం చేయడానికి దేవతలు, రాక్షసులు, మునులు,యక్షులు, ప క్షులు, గంధర్వులు మొదలైనవారి అంశాలతో భీష్ములు మొదలైన మహావీరులు పుట్టారు. వారి బలాబలాలు తెలిసి చెప్పటానికి అనేకవేల ముఖాలు కలవారు కూడా చాలా కాలం చెప్పినా తరిగిపోని శౌర్యపరాక్రమాలు కలిగినవీరులు వారు. అంటే వర్ణించడానికి మాటలు చాలవు. ఇదంతా విని జనమేజయుడు వైశంపాయనునికి చేతులెత్తి మొక్కి ఇంకా మాట్లాడాలని అనుకొన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము