నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పరశురాముండు భీకర నిజకోపాగ్ని నుగ్రుఁడై యిరువది యొక్కమాఱు
ధాత్రీ తలం బపక్షత్త్రంబు సేసిన ఁ దత్‌క్షత్త్రసతులు సంతాన కాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁజేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువుర ఁగొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్ క్షత్త్ర మెసఁగి యుర్వి
ఆ. బర్వి రాజధర్మపద్ధతి ననఘమై
జారచోర దుష్టజనుల బాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ
జేయుచుండ శిష్టసేవ్య మగుచు
భావం: పరశురాముడు ఉగ్రకోపియై ఇరవై ఒక్కసార్లుక్షత్రియులందరిని వధించారు. ఆ రాజుల భార్యలందరూ సంతాన కాంక్షతో ఋతుకాలాలలో బ్రాహ్మణ శ్రేష్ఠుల అనుగ్రహంతో ధర్మవిధిని అనుసరించి సంతనాన్ని పొందారు. మళ్లీ రాజవంశాలు వర్ధిల్లాయి. అట్లా జన్మించిన రాజులు ధర్మమార్గాన్ని విడువక జార చోర దుష్టజనాల బాధ లేకుండా జనులను కాపాడుతూ భూమిని పాపరహితంగా పరిపాలించసాగారు. వారి పాలన శిష్టసేవ్యమై ఉన్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము