మంచి మాట

పురుషార్థములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులందరు కోరుకొనేది ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇవి వేదములో ప్రతిపాదించబడినవి. మనము ఎలా జీవించాలో ధర్మార్థకామమోక్షాలు ఎలా సంపాదించాలో మనకు తెలియాలి. మోక్షం అంటే ఏమిటో స్పష్టత రావాలి. మానవునిగా మన ధర్మం ఏమిటో మనకు తెలియాలి. వాటిని సాధించుటకు ఏఏ విధాలుగా సాధన చేయాలి అనే విషయం తెలిసికోవాలి. పురుషులు అంటే సమస్త మానవకోటి అని అర్థం. ధర్మఅర్థకామాలను త్రివర్గము అనే పరిగణన ఏర్పడింది.
ధర్మార్థకామాలలో ధర్మానిదే ప్రాధాన్యం. ధర్మవర్జతమైన, కేవలం అర్థంకాని, కామంగాని, అనుభవింపదగదు. ధర్మంతో కూడిన కామం, ధర్మంతో గూడిన అర్థం, సుఖశాంతులనిస్తాయి. జనులు ఎలా జీవించాలి అనేది మన వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. జీవాత్మ, పరమాత్మ కాబోయేలోగా, ప్రతి వానిచేత కోరబడే సర్వసాధారణమైన నాల్గు పురుషార్థములు. ఎలా ఆచరించాలో మన వేదాలలో పేర్కొనబడినది. జీవితంలో సుఖం అనుభవించడం దోషంకాదు. కాని, సుఖంకోసం అధర్మమార్గాలు ఆశ్రయించడం తప్పు. ఇది చెడు కర్మలకు తద్వారా కష్టాలకు దారితీస్తుంది. అందుకే ధర్మంగా సుఖాలను అంటే ధనము, భార్య కుటుంబము ఇల్లు, విద్యాప్రాప్తి మనిషికి ఇస్తూ మనిషికి కలిగే క్షణికమైన కోరికలను సంతృప్తిచేస్తు సుఖాలను, భగవత్ప్రాసాదంగ అనుభవించమని వేదం ఉద్భోధిస్తుంది.
ప్రతి మనిషి తన జీవితంలో ఇవి సాధించడానికి ప్రయత్నించాలి. పురుషార్థాలలో ధర్మం ఎంతో విశిష్టమైంది. ఈ విశ్వం సమస్తం, ధర్మాన్ని ఆశ్రయించే ప్రవర్తిస్తుంది. ధర్మబద్ధమైన జీవితానికి కట్టుబడుట అనగా స్వధర్మాచరణకు కట్టుబడి, జీవించుటయని మనము గ్రహించవలయును. యుగముమారితే దేశకాల పాత్రానుసారముగా స్వధర్మం మారవచ్చుగాని, కాని ఏ యుగమందైన జన్మమువల్ల వృత్తివలన, సంఘమువలన ప్రాప్తించిన స్వధర్మము విడిచిపెట్టరాదు. నా విషయంలో ఎలా ఉండాలని ఆశిస్తానో నేను ఇతరుల విషయంలో అలాగే వుండాలి. నా విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించకూడదని నేను ఆశిస్తానో నేనుగూడ ఇతరుల విషయంలో అలా ప్రవర్తించకుండా జీవించాలి ఇదే ధర్మమార్గం.
డబ్బు ఏదైన కావచ్చు, వస్త్రాలు, ఇల్లు, నగదు, బ్యంకుల్లో భద్రపరచిన ధనము, ఆస్తిపాస్తులు, బిరుదులు, పరువుప్రతిష్టలు, వివిధ రకాలైన అధికారములు ఇవన్ని, అర్ధముయొక్క రూపములే. ప్రతి మనిషి మంచివాడే, ధన సంపాదన అనే అత్యాశే, మనిషిని అశాంతికి గురిచేస్తుంది. ధనము, ధర్మము పరిధిలో ఉన్నంతకాలము అది అర్థము. అధర్మక్షేత్రములో ప్రవేశించగానే అనర్థమవుతుంది. ధనం మత్తువంటిది అది మనిషిని అంధుని చేస్తుంది. ప్రక్కవారినిగూడ పట్టించుకోని స్థితికి వస్తుంది.
విషయ వాసనా లేక కోరికను, కామమ్ము అంటారు. స్ర్తిలయందు అనురక్తి స్ర్తివాసన, ధనమందు ఆసక్తి ధనవాసన, కీర్తియందు ఆసక్తి కీర్తివాసన, లౌకిక విషయములందు ఆసక్తి లోకవాసన. ఈ కోరికలన్నియు ఈ జన్మకే తీరిపోవును. తీరని వాటిని వాసనలుగా పరిగణించి జన్మబంధములు కలుగజేయును. అగ్నిలో ఎన్నికట్టెలు వేసినా, అది చాలు, అనదు. అన్నింటిని దహనం చేస్తుంది. అలాగ కోరికలకు అంతు లేదు.
ఇవి తీరనపుడు ప్రశాంతత కోల్పోతాము. మనసు ప్రశాంతత కావాలంటే కోరికలు (కామము) తగ్గించుకోవాలి. కోరికలు ఉండడం తప్పుకాదు.నీతిమాలిన కోరికలతో మునిగిపోవడం ఖాయం. అవన్నీ మనల్ని బంధాలలో పడవేసి, మనలోని వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటాయి. కోరికలను, క్రమంగా అదుపులోనికి తెచ్చి అంతరాత్మ లోతుల్ని అర్థంచేసికోవాలి. ఆపైన మన ఆత్మపరిపూర్ణత్వాన్ని సాధించేందుకు వీలుగా కోరికలను ఎలా మలుచుకోవాలో తెలిసికోవడమే సరియైన పరిష్కారము.
బగవంతుని ప్రార్థింపుము భగవంతుని, శరణువేడము, నీలో నూతన ఉత్సాహం మొదలవుతుంది. ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తివస్తుంది. కన్నీళ్ళింకిపోతాయి. జీవన పోరాటంలో ఎదురీదగలిగే మార్గదర్శకునిగా ముందుకు రాగలవు.

- నివర్తి వేంకట సుబ్బయ్యశర్మ