నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. దితిసుత దానవ యక్ష
ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా
హితుల గుచుండి రనేకులు
జితకాశులు ధరణిపతులుశివుపాలాదుల్

భావం: దైత్య దానవ యక్షుల అంశలతో పెక్కుమంది శిశుపాలాది జయగర్వితులైన రాజులు జన్మించి ప్రజలకు హితులుగాను, అహితులుగాను ఉన్నారు.

చ. అతుల బాలాఢ్యులైన యమరాంశ సముద్దపు లెల్ల ఁబాండుభూ
పతిసుతపక్ష మై, సుర వివిక్ష గణాంశజు లెల్ల దుర్మదో
ద్దత కురురాజ పక్షమయి ధారుణి భారము నాయ ఘోరభా
రత రణభూమి నీల్గిరి పరస్పరయుద్ధము సేసి వీరులై
భావం: దేవతల అంశలతో జన్మించిన సాటిలేని పరాక్రమవంతులలంతా పాండవేయుల పక్షమై రాక్షసాంశంతో పుట్టినవారంతా ఉద్ధతుడు , ఉన్మదుడు అయిన దుర్యోధనుడి పక్షాన్ని పొంది,వీరులై ఒకరితో ఒకరు పోరాడి భూభారం తొలిగేట్టుగా భారత రణరంగాన హతులైనారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము