నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. విగతాఘఁడైన యాభృగునకు ఁ బత్రుడై చ్యవనుండు పుట్టె భార్గవవరుండు
జనవంద్యుఁడతనికి మసుకన్యకకు ఁబుట్టీ నూరుల నౌర్వుండు భూరికీర్తి
యతినికి నూర్వురు సుతులు బుచీకాదు లుదయించి రఖిల భూవిదిత తేజు
లందు బుచీకున కొందంగా జమదగ్ని యనుముని పుట్టె నాతనికి ఁబుట్టె
ఆ రలఘుమతులు సుతులు పలువురు వారిలో
బరశురాముఁడాది పురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యను
దద్ధగుణములందు ఁ బెద్ద యయ్యె
భావం: పరమపుణ్యుడైన భృగువుకు చ్యవనుడు జన్మించాడు. పూజ్యుడైన చ్యవనుడికి మను కన్యక భార్య అయింది. ఆ దంపతులకు ఊరువులందు ఔర్వుడు జన్మించాడు. అతడికి ఋచీకాదు లనబడే నూరుగురు కుమారులు పుట్టారు. వారిలో ఋచీకుడికి జమదగ్ని ఉదయించాడు. ఆ జమదగ్ని మహామునికి నలుగురు కుమారులు. వారిలో పరశురాముడు మహావిష్ణువు అవతారం. అతడు శత్రుసంహారం కావించి చిన్నవాడైన మహామహుడుగా ప్రసిద్ధి కెక్కాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము