డైలీ సీరియల్

బంగారుకల 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చంద్రా!’’
‘‘మంజూ! సాహసం కూడా అదను కనిపెట్టి చేయాలి. ఈ వార్త నాకూ తెలిసింది. తిమ్మరుసుగారికి చేరింది కూడా! న్వు మీ ఇంటికి పో! నేనూ వచ్చి కలుస్తాను. అక్కడ నీ అవసరం ఉంది’’ అంటూ ఆమెను అశ్వంపైన ఎక్కించుకొని కృష్ణసాని ఇంటి దగ్గర దింపి వచ్చినంత వేగంగా వెళ్లిపోయాడు చంద్రప్ప.
ఇంటి దగ్గర జనం గుమికూడారు. తలా ఒకటి అనుకుంటున్నారు.
‘‘ఎలా జరిగింది. ఎవరు చేశారో ఈ ఘాతుకాన్ని’’ ఎవరో వ్యాఖ్యానించారు.
‘‘కాలమహిమ’’ మరొకరి బదులిది.
‘‘బతికనన్నాళ్ళు కూతురి వైభోగం కోసమే తపించింది’’ ఒకరు జాలి చూపిస్తున్నారు.
ప్రజల మాటల్ని దాటుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్లిన మంజరి ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని చూసి నిట్టనిలువుగా కూలిపోయింది.
‘‘అమ్మా!’’ ఆ ఆక్రందన అందరి హృదయాలను పిండేసింది.
రాత్రి ఎవరో ఇంట దూరి విలువైన రత్నాభరణాలు దొంగిలించి కృష్ణసాని గొంతు నులిమారట. ఆమె అతనిని చూసి వుంటుంది. అందుకే ఈ మరణం. మరి కాసేపట్లో చిన్నాదేవికీ వార్త అందింది. ఆమె పంపిన రాజోద్యోగుల సాయంతో మంజరి తల్లి అంత్యక్రియలను పూర్తిగా నిర్తర్తించగలిగింది.
ఇక ఈ భవంతిలో ఏముంది? తనను గొప్ప స్థానంలో చూడాలని బతికినన్నాళ్లూ తపించిన తల్లి ఇక లేదు. తాను ప్రేమించిన చంద్రప్ప మారువేషంలో తిరుగుతున్నాడు. ఈ భవనంలో తనకి భద్రత ఏముంది.
మంజరి చిన్నాదేవి భవనానికే చేరింది. ‘‘చిన్నాజీ’’ అని ఏడుస్తున్న మంజరిని కౌగిలించుకుని కంట తడిబెట్టింది చిన్నాదేవి. ప్రేమతో మంజరిని ఓదార్చింది.
‘‘నేటినుంచి నువ్వు నా సోదరివి. నా దగ్గరే వుండు’’ అని పలు విధాల సమాధానపరిచింది. మంజరి మనసులో ఆకాశమంత దిగులున్నా తారకల్లాంటి వెలుగు దివ్వెలు దూరాన కన్పిస్తుంటే కొంత ఊరట చెందింది.
***
రాయల సైన్యం రాయచూర్ ముట్టడికి బయలుదేరింది. వారి వ్యూహం ప్రకారం రాయచూర్‌కి తూర్పు దిక్కున రాయల సైన్యం శిబిరాల్లో ఉంది. ముట్టడికి రాయలు సర్వసన్నద్ధంగా తరలి వస్తే ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ అశ్వపదాతి దళాలతో కోటకు తొమ్మిది కోసుల దూరాన నిలిచి కందకాలు, ఫిరంగులతో యుద్ధానికి సిద్ధమైనాడు. రాయలు గ్రహించాడు.
కోట ముట్టడికి కొంత సైన్యాన్ని అక్కడే ఉంచి మరికొంత సైన్యంతో ఆదిల్‌ఖాన్‌ని ఎదిరించటానికి పూనుకొన్నాడు. నిజానికి ఈ యుద్ధం రాయల శక్తికి మించిపోయింది. ఒక దశలో అపజయం సూచనలున్నాయి. చివరికి అవమానం ఒప్పుకోని ధీమంతుడైన రాయలు యుద్ధ రంగంలోకి స్వయంగా దిగి, తన సైనికులకు బలాన్నిచ్చాడు. ‘విజయమో వీరస్వర్గమో’ అనే నినాదాలతో సైనికులకు నాయకత్వం వహించి నడిపించాడు. రాయల పౌరుషం శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది. అపజయం విజయంగా మారింది. ఆదిల్‌ఖాన్ పారిపోయాడు. అతని సేనాధిపతి బందీ అయ్యాడు. ఆదిల్‌ఖాన్ పరాజయాన్ని కళ్ళారా చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఇలా అన్నాడు.
అలుక ...........గల శ్రేణికిన్
రాయలు రాయచూర్‌పై యుద్ధానికి వెళ్లినపుడు సపరివారంగా కవులు, పండితులు వెంట ఉన్నాయి. యుద్ధ శిబిరం యుద్ధ్భూమిలా లేదు. రకరకాల ధాన్యాలు, ఆభరణాలు, ముత్యాలు అమ్మకాలు జరిగాయి. ఏదో మహానగరంలా ఉంది. రాయలు పోర్చుగీసు సైనికుల సహాయాన్ని కూడా పొంది రాయచూర్ ముట్టడిని సాధించాడు.
తల్లి మరణం తర్వాత మంజరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చిన్నాదేవి ప్రేమ, చంద్రప్ప స్నేహం ఆమెను బాధను మరిపిస్తున్నాయి.
‘‘మంజూ! ఈ రోజు భువన విజయానికి రావాలి’’ చంద్రప్ప ఆహ్వానించాడు.
‘‘ప్రత్యేకత వుందా’’ నిరాసక్తంగా అంది.
‘‘ఈరోజు రాయలవారు అన్ని భాషల కవులకు తమ కవిత్వాలు చదివే అవకాశం ఇస్తున్నారట’’.
‘‘అష్టదిగ్గజ కవుల కవిత్వాలు, ఛలోక్తులు ఎంతో రమణీయాలు కదా! మరి ఈ కవులెవరు? ఏ దేశంవారు?’’ ఆమెకి ఆసక్తి కలిగినట్లుంది.
‘‘మన దేశంలోని అన్ని భాషల కవులు విచ్చేస్తున్నారు. వస్తే నీ మనస్సు ఆనంద తరంగితవౌతుంది’’
‘‘మరి నువ్వు రావా?’’
‘‘ఎందుకు రాను. కానీ నన్ను అక్కడ నువ్వు గుర్తించలేవు’’
అతనికి మంజరిని త్వరగా వివాహమాడాలని వుంది. కానీ తల్లి మరణంతో దిగాలుపడిన ఆమె వద్ద అటువంటి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న మంజరి మనసును ఉల్లాసపరచాలని చంద్రప్ప ప్రయత్నం. ఆ విషయం గ్రహించిన మంజరి భువన విజయానికి హాజరవటానికే నిర్ణయించుకుంది.
***
భువన విజయ సభ ఇంద్రసభను తలపిస్తున్నది. శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పూర్వ పశ్చిమ దక్షిణ సముద్రాధీశ్వర, మూరురాయర గండ, సాహితీ సమరాంగణ సార్వభమ శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలకు జరుూభవ! విజరుూభవ! వందిమాగధుల స్తోత్రాలతో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కొలువుదీరాడు.
కర్ణాటాంధ్ర సామ్రాజ్య రక్షామణి సభావైభోగం కళ్ళారా చూడాలే గానీ ఊహింపశక్యము కాదు.
తిమ్మరుసు మంత్రి కనుసన్నలలో సభ ప్రారంభమైంది. మొదటగా ఆళ్ళపాక పెద తిరుమలయ్యగారు అన్నమాచార్యుని పద కవితలను భక్తి పురస్సరంగా ఆలపించారు.
తందనానా అహి తందనాన పురె
.........................
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే
విశిష్టాదైత్వంలోని ఆధ్యాత్మిక తత్త్వాన్ని సంకీర్తనగా విన్న కృష్ణరాయలు పరవశించాడు.
నాడు ఒక ప్రత్యేకాంశం భువన విజయసభలో జరిగింది. తిమ్మనకవి నిలబడ్డాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి