నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఇమ్మహిఁ ద్రయోదశద్వీ
పమ్ములు దనశౌర్య శక్తిఁ బాలించి మదాం
ధ్యమ్మున విప్రోత్తమని
త్తమ్ములు దానపహరించె ధనలోభమునన్
భావం: పూరూరవ చక్రవర్తి పదమూడు ద్వీపాలతో కూడిన భూమిని మహాశౌర్యంతో పాలిస్తూ మదాంధుడై బ్రాహ్మణోత్తమముల ధనాలను ధనాశాపరుడై అపహరించాడు. దక్షుడి కూమార్తె యైన అదితికీ కశ్యపుడికీ జన్మించిన వివస్వంతు డనేవాడికి వైవస్వతుడనే మనువు, యుముడు, శని, యమున, తపతి అనేవారు పుట్టారు. వారితో వైవస్వతుడనే మనువు వలన బ్రాహ్మణులు, క్షత్రియుల, వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. ఆ వైవస్వతుడికి వేనుడు మొదలైన రాజులు ఏభైమంది జన్మించి వంశాన్ని వృద్ధిచేసి చివరకు తమలో తాము పోరాడి మరణించారు. ఆ మనుపుత్రిక అయిన ఇల అనే ఆమెకు చంద్రుడి పుత్రుడైన బుధుడికి పూరూరవుడు జన్మించాడు. అతడు చక్రవర్తి అయినాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము