నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. చతురంబోధి పరీత భూవలయమున్ నద్వీప సారణ్యస
క్షితిభృద్కం బగుదాని భూరి భుజశక్తిం జేసె పాలించుచుం
గ్రతువుల్ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా
హితుఁడై యానహుషుండు దాఁ బడసె దేవేంద్ర త్వముం బేర్మితోన్
భావం: ద్వీపారణ్య పర్వతాలతో కూడిన యున్నూ నాలుగు సముద్రాల చేత చుట్టబడినది యున్నూ అయిన భూమండలాన్ని తన అపార బాహుబలంతో పరిపాలిస్తూ నూఱు యజ్ఞాలు చేసి తన కీర్తి నలుదిశలకు వ్యాపింపచేసి శత్రువులను జయించిన వాడైన ఆ నహుషుడు దేవేంద్ర పదవిని పొందాడు. నహుషుని భార్య ప్రియంవద. ఆ దంపతులకు యతి , యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువులు అనే ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో యయాతి రాజై అనేక యజ్ఞాలు చేశాడు. శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని పెళ్లాడి అతకు యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. వృషపర్వపుత్రియైన శర్మిష్ఠయం దాతడు ద్రుహ్వి, అనువు, పూరుడనే ముగ్గురు కుమారులను పొందాడు. రాజ్యపరిపాలన చేస్తూ శుక్రుడి శాపం వలన ముసలి తనం చేత పీడించబడ్డవాడయ్యాడు. అప్పుడా యయాతి తన కుమారులనందరినీ పిలిచి వారితో తన వార్థక్యాన్ని మాట్లాడాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము