నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. వాఁడి మయూఖముల్ గలుగు వాఁ దపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతను, నిష్టమెయిన్ భవదగ్ని హోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్
రాఁడు నవంబులోని మృగరాక్షసపన్నగ బాధ నొందెనో!

భావం: కచుడీ విధంగా శుక్రుని ప్రియశిష్యుడిగా ఉన్నందువల్ల బృహస్పతి కుమారుడైనందువల్ల శుక్రుని దగ్గర ఉన్న ఇతర రాక్షస శిష్యులకు కచుడు భరించలేనివాడుగా తయారైయ్యాడు. ఆ సమయంలో ఓ రోజు సూర్యుడు పడమటి సముద్రంలో క్రుంకాడు. హోమధేనువులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. చీకటి పడటం వలన నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా పొద్దుపోయింది.కాని హోమసమిధలుతేవడానికి వెళ్లిన కచుడు మాత్రం గురువు గారి ఆశ్రమానికి తిరిగి రాలేదు. అడవిలో మృగ రాక్షస సర్పాల వలన ఏబాధనైనా పొందాడేమో నని ఆశ్రమ వాసులు, దేవయాని అనుకోసాగారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము