నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అడవికిఁ బువ్వులు దేరఁగ
వడి నరిగిన కచుని ఁ జంపి వారక దనుజుల్
పొడవు సెడఁగాల్చి సురతోఁ
దడయక యబ్బూది శుక్రుఁద్రావించి రొగిన్
భావం: శుక్రుని వద్ద విద్యనభ్యసించే కచుని చూచి అసూయ చెందిన రాక్షసులు అతడిని ఏవిధంగానైనా పరిమార్చాలని ఎపుడూ చూచేవారు. అలాంటి సమయంలో ఓసారి అడవికి వెళ్లిన కచుడ్ని రాక్షసులు చంపి వేశారు. ఆకచుని మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. అందరూ వచ్చినా కచుడు రానందున దేవయాని చాలా బాధపడి తన తండ్రికి విషయమెరిగించింది. అపుడు ఆ శుక్రుడు తన దివ్యదృష్టితో అసలు విషయాన్ని తెలుసుకొని తాను తనకొచ్చిన మృతసంజీవని విద్యతో అడవిలో చనిపోయి ఉన్న కచుణ్ణి తిరిగి బతికించి తీసుకొవచ్చాడు. కాని కొన్నాళ్ల తరువాత మరలా రాక్షసులు కచుడిని మట్టుపెట్టాలని అనుకొన్నారు. అట్లాంటి సమయంలో ఓసారి పూవులు తేవడానికి వెళ్లి న కచుడిని అదును చూచి రాక్షసులు మట్టుపెట్టారు. ఈసారి కచుడి శరీరాన్ని అగ్నికి సమర్పించి బూడిద చేశారు. పైగా ఆ బూడిదను తీసుకొచ్చి శుక్రాచార్యుడు సేవించే సురపానంలో కలిపి శుక్రుని చేత బూడిద కలిపిన మద్యాన్ని సేవింపచేశారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము