డైలీ సీరియల్

బంగారు కల - 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభలో ఒక్కసారిగా ఆనంద కోలాహలం మిన్నుముట్టింది మంగళ తూర్యరవాలు సందడించాయి. పటాహ, భేరి, ఢక్కా, కాహళ, దుందుభి ధ్వానాలతో హాంతరాళం పిక్కటిల్లింది.
****
శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు మంత్రి. రామలింగనాయకుడు సమావేశ మందిరంలో దీర్ఘ సమావేశం జరుపుతున్నారు. తిమ్మరుసు చాలా గంభీరంగా ఉన్నారు.
‘‘విజయనగర రాజప్రతినిధిగా ఉన్న సేనాధపతి పెమ్మసాని తిమ్మనాయకుడ్ని మధురై పాండ్యరాజును అణచటానికి పంపాము’’ రాయలు సాలోనగా అన్నారు.
‘‘అక్కడినుంచి వచ్చిన వార్తల ప్రకారం తిమ్మ నాయకుడు మధురై పాండ్యరాజును ఓడించాడు. కానీ రాజ్యకాంక్షతో కన్నూ మిన్నూ గానక తిమ్మ నాయకుడు మధురై రాజ్యానికి తనను స్వతంత్రరాజుగా ప్రకటించుకున్నాడు. అతనిని పట్టి తెచ్చే వీరుడెవరని సభలో ప్రశ్నించినపుడు విశ్వనాథ నాయకుడు ముందుకొచ్చాడు. అతడు తిమ్మనాయకుని కుమారుడవటం విశేషం’’ తిమ్మరుసు చెప్పారు.
రాయలు గంభీర వదనంతో వింటున్నారు.
‘‘అవును ప్రభూ! మనకందిన వార్త ప్రకారం విశ్వనాథ నాయకుని ప్రభుభక్తి ఎన్నదగింది. అతను సైన్యంతో మధురకెళ్లి తండ్రిని ఓడించి, బంధించి విజయనగరానికి ఖైదుగా తెచ్చి అప్పగించాడు. విశ్వనాథ నాయకుడు ఇపుడు మీ దర్శనాకి వేచి వున్నాడు ప్రభూ!’’ రామలింగ నాయకుడు గంభీరంగా అన్నాడు.
‘‘తక్షణం అతనిని ఆహ్వానించండి’’ తిమ్మరుసు ఆనతిచ్చారు. విశ్వనాథ నాయకుడు వీరసింహంలా అడుగుపెట్టాడు. రాయలతనని ప్రశంసాపూర్వకంగా చూశారు.
‘‘విశ్వనాథ నాయకా! నీ వీరత్వం ఉన్నతమైనది. పితృభక్తికన్నా రాజభక్తి గొప్పదని నిరూపించావు. మధురై రాజ్యానికి నిన్ను రాజును చేస్తున్నాను. నేటి నుండి నీవు మా సామంతరాజుగా మాకు అభిమాన పాత్రుడవయ్యావు’’
‘‘్ధన్యుడ్ని ప్రభూ!’’ విశ్వనాథ నాయకుడు నిష్క్రమించాడు. తిమ్మరుసు రాయలకేసి ప్రశంసపూర్వకంగా చూశాడు. తాను తీర్చిదిద్దిన మహాప్రభువు రాజనీతిజ్ఞతను కళ్ళారా చూస్తున్న తిమ్మరుసు మనస్సు తృప్తిగా పలకరించింది.
***
ఆ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి
చంద్రుని వెనె్నల కాంతులతో భూమ్యాకావాలు స్వచ్చంగా వెలుగుతున్నాయి. విజయనగర పరిసర ప్రాంత ప్రకృతి అంతా జరగబోవు కల్యాణ మహోత్సవానందాన్ని అప్పుడే పొందుతున్నట్లు కన్పిస్తున్నది. ఆకాశ మార్గంలో వికాస రేఖల్లా విజయనగర ప్రాంతంలోని పర్వత పంక్తులు గంభీర రమ్యంగా దర్శనమిస్తున్నాయి. ఆ పర్వతశ్రేణులపై నాటినట్లుగా ఉన్న చెట్లు, ఆ వెనుక లేత గచ్చకాయ రంగు ఆకాశం, ఆపైన పడమటికి వాలిపోయి మెల్లగా ప్రయాణం చేసే చంద్రుడు, అంతా ఒక అద్భుత చిత్రపటంలా కనిపిస్తోంది.
మగపెళ్లివారు విజయనగరానికి మూడు కోసుల దూరంలో ఉన్నారు. రాత్రి రెండు జాములు దాటింది. ఆనందాతిరేకంవల్ల ఎవ్వరికీ నిద్ర రావటంలేదు. సహజ సుందర ప్రకృతివల్ల.. వాతావరణంలోని చల్లదనంవల్ల మెల్లగా నిద్రాదేవి వొడిలో సేద తీరారు. కాలినడకన మెల్ల మెల్లగా సైన్యం కదులుతున్నది. భద్రగజంపై అంబారీపైన రామరాయలు, అన్నివైపులా అశ్వారోహకులు మందగమనంతో నడుస్తుండగా విజయనగర ప్రకృతి దృశ్యాలు చూస్తున్నాడు. పరిచితమైన ప్రదేశాలే కానీ ఈ రోజు వింత సొగసుతో కన్పిస్తున్నాయి. ఇదివరకు తెలియని నూతన సంచలనానికి మనసు లోనవుతోంది. తెలియరాని తీయని బాధ కలుగుతుంది.
పెళ్లిబృందం విజయనగరాన్ని సమీపించింది. రామరాయల తండ్రి శ్రీరంగదేవరాయ ఆజ్ఞతో దుందుభిధ్వానాలు భేరీ ఖీంకారాలు మోగాయి. మంగళతూర్యరవాలు చెలరేగాయి. మేనాల్లో నిద్రిస్తున్నవారు తుళ్లిపడి లేచారు. అందరి హృదయాలు ఒక్కసారి ఉప్పొంగాయి. ఠీవిగా సంబరపడ్డారు.
దూరాన రెండు కోసుల దూరంలో ఎత్తుగా దట్టమైన వెలుగు కన్పించింది. ఆ కాంతి వెనుకగా ఉన్నతంగా విజయనగర రాజసౌధోపరిభాగాలు కన్పిస్తున్నాయి. వాటికి తాపిన చిన్నమణులు నక్షత్రాల్లాగా, పెద్దవి చంద్రునిలా వెలుగుతున్నాయి. కోటకి కట్టిన మణిహారాలు నక్షత్ర మాలికల్లా, ద్వారాలకి ఇరుపక్కలా ఉంచిన పూర్ణమణికుంభాలు బాలసూర్యగోళాల్లా ప్రకాశిస్తున్నాయి. దీపాల కాంతులామణులపై బడి ప్రతిబింబించటంవల్ల విజయనగరమంతటా పున్నమి వెలుగుల్ని నింపుకుంది. నగరమంతా చిత్రవర్ణ దృశ్యంగా ఉంది.
ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా పెక్కు నగరాధ్వనులు వెలువడ్డాయి. ఆ ధ్వనులతోపాటు వెలుగు దగ్గరయింది. పెళ్లికొడుకు బృందం ఇంకొక కోసు దూరం ప్రయాణించింది. అటువైపునుంచి వధువు పక్షంవారు మరికొన్ని గజాలు కదిలారు. రెండు బృందాలు ఒకరికొకరు అంతదూరంలో ఉండగా నగరా ధ్వనులు ఆగిపోయాయి.
అద్భుతంగా అలంకరించబడిన ఒక పట్టపుటేనుగు మీద శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యక్షమయ్యారు. వంధి మాగధులు స్తోత్రం చేశారు.
‘‘రాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరురాయరగండా! జయ జయహో!
అరివీర భయంగర దోర్దండా
సరస సాహితీ సమరాంగణ సార్వభౌమా! జయ జయహో’’
మరోసారి దుందుభి ధ్వానాలు మారుమోగాయి.
వరుడు రామరాయలు ఉన్నతమైన ఏనుగుపై విరాజిల్లుతున్నాడు. కొంచెం దూరంలో అతని తండ్రి శ్రీరంగ దేవరాయలు అంబారిమీద కూర్చొని ఉన్నాడు. ఎడమవైపు అతని సోదరులు, వెనుకగా రాజపరివారం. దుందుభి ధ్వానాలు మరలా మారుమ్రోగాయి. వందిమాగధులు శ్రుతిపక్వంగా స్తోత్రం చేశారు.
- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి