నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. మొదలి పెక్కు జన్మములఁ బుణ్య కర్మముల్
పరఁగఁ బెక్కు సేసె వడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాతన
చెఱుచు మద్యసేవ సేయ నగునె?
భావం: వేళకు ఇంటికి రాకపోయేసరికి దేవయానికి చాలా దుఃఖం కలిగింది. ఆమె ఆ దుఃఖాన్ని పోగొట్టుకోలేక తన తండ్రిని కచుడి సమాచారం తెలుసుకోమని అడిగింది. కచుడు దానిని పట్టించుకొనక మద్యపాన మత్తుడై ఉండడం చూచి దేవయాని మిక్కిలిగా రోదిస్తూ ఉండిపోయింది. ఆ సమయంలో శుక్రుడు తన కుమార్తె ఏడ్వడం చూచి చాలా దుఃఖించి కచుని గురించి గుర్తుకు తెచ్చుకుని కచుడెక్కడ అని తన దివ్యచక్షువులతో చూడగా కచుడు తన కడుపులోనే బూడిద రూపంలో ఉన్నాడని తెలుసుకొని మిక్కిలిగా వ్యధచెందాడు. అపుడు తన్ను తాను పూర్వమందలి అనేక జన్మాలలో పుణ్యకార్యాలను ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానం జనాలకు క్షణమాత్రంలోనే పొగొట్టే మద్యపానం చేయదగునా? అని ఆలోచనలో కూరుకుపోయాడు శుక్రాచార్యుడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము