భక్తి కథలు

హరివంశం - 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానుభావులైన విప్రులెందరో వస్తున్నారు. ప్రతిరోజూ కొల్లలుగా విందులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి బృందావన ప్రజ నివాసులను అపరిమితంగా నెయ్యి, పాలు, పెరుగు, అడవి తేనెలు తీసుకొని రమ్మన్నానని నా ఆజ్ఞగా వాళ్లకు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి ఉంది. నా మేనళ్ళులను చూద్దామని నాకెంతో ఉత్కంఠగా ఉంది. వాళ్ళనింతవరకు నేను చూడనే లేదు.
దేశ దేశాల వాళ్ళు వాళ్ళను గూర్చి ఎంతో చెప్పుకుంటున్నారు. వాళ్ళ బలధీశక్తియుక్తులు పొగడుతున్నారు. నాకైతే గుండె కొట్టుకలాడుతున్నది వాళ్ళను ఎపుడెప్పుడు చూస్తానా అని! కౌగిలించుకుని ఎపుడెప్పుడు గారాబం చేద్దామా అని మనసు కొట్టికలాడుతుందని చెప్పు వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళకు విశ్వాసం కలిగించు.
నా మేనల్లుళ్ళను గురించి లోకమంతా పరమాద్భుతంగా చెప్పుకుంటున్నది కదా! వాళ్ళ బలదర్పాలు చూడాలని నాకెంతో వేడుకగా ఉంది. కుతూహలంగా ఉంది. మన దగ్గర ఇద్దరు మల్లులున్నారు కదా! ఈ మల్లులతో నా అల్లురకు క్రీడా పోటీ ఏర్పాటు చేసి ఆనందిద్దామని కూడా అనుకుంటున్నాను. మధురాపురి వాసులంతా ఈ మల్లక్రీడ చూసి సంబరపడుతారు. వినోదిస్తారు. వాళ్ళకు మెప్పు కలిగేట్లు చెప్పి నీతో వెంటబెట్టుకుని రావాలి.
వాళ్ళకు ఇంపుగా సొంపుగా బోధించి నీతో తీసుకొని రావాలి. వాళ్ళకేమీ రోషంగా, అనాదరం కాని కలగకుండా నీ మాట నేర్పు ప్రయోగించాలి. వాళ్ళు ఇంతవరకు పట్టణాలను ఎరుగరు. వాళ్ళకా పల్లె పట్టులే ఇష్టంగా ఉంటాయి. మాకెందుకీ పట్టణ వాసం అంటారో ఏమో! అందువల్ల నీ చాతుర్యం చూపి వాళ్ళను వెంట తీసుకొని రావాలి. వాళ్ళిద్దరినీ తీసుకొని వచ్చావా అంటే నాకు గొప్ప ఉపకారం చేసినవాడివవుతావు. చూడు! వసుదేవుడు నీకు ఏదో చెప్పబోతాడు. కాని అతడి మాటలు నీవు ఎంత మాత్రం పట్టించుకోవద్దు. తెల్లవారగానే నీవు బయలుదేరాలి సుమా! అని కంసుడు అక్రూరుడికి అనునయంగా చెప్పాడు.
ఇట్లా కంసుడు చెప్పేటప్పటికి అక్రూరుడు ఎంతో పొంగిపోయినాడు. వాళ్ళనెప్పుడూ చూదామా అని పట్టలేని తమకం కలిగిందాయనకు. దప్పికతో బాధపడుతున్నవాడికి హృద్యమూ మధురమూ శీతలమూ అయిన జలం తెచ్చి అందించినట్లైంది. ఆ శ్యామసుందరుణ్ణి, శ్రీ వత్సవక్షుణ్ణి, ఆ పద్మపత్రాయతాక్షుణ్ణి, హలకులిశ పద్మ రేఖా సమలంకృత పాద కర సరోరుహుణ్ణి, పాలకడలి శయనుణ్ణి, భక్తపరిపాలుణ్ణి, ఆదిదేవుడే ఇపుడు యాదవుల ఇంట శిఖిపింఛదాముడై, మురళీ మనోహరుడై గోవులను కాస్తున్నవాణ్ణి దర్శించబోతున్నానని అక్రూరుడు ముదిత చిత్తుడైనాడు.
ఆయన నా పట్ల ప్రేమ వీక్షణాలు ప్రసరింపజేస్తే నా జన్మ ధన్యమవుతుంది. మునులు ఎంతో తపస్సు చేస్తేగాని ఆయనను దర్శించలేరు. ఆయన దర్శన, స్పర్శన, ఆలాపాలవల్ల మూడు లోకాలలోనే నేను గొప్ప గౌరవ భాజనుణ్ణి అవుతాను. బలభద్రమూర్తితో కూడి ఈ జలజాక్షుడి సన్నిధి నాకు లభించటం నాకు జన్మ జన్మల బంధం వీడిపోతుంది అని అక్రూరుడు తన అదృష్టాన్ని పొగడుకున్నాడు. పరమోత్సవమేదో తనకు సంప్రాప్తించినట్లు మధురానగరం నుంచి బృందావనానికి ఆయన ప్రయాణమైనాడు.
కంసుడు, వసుదేవుణ్ణి తూలనాడటం యదు వృద్ధులు సహించలేకపోయినారు. చాలా బాధపడ్డారు. ఈ దుర్మార్గుడి రోజులు దగ్గర పడ్డాయని భావించారు. యాదవ వృద్ధుడైన అంధకుడు కంసుడి దుష్ట వచనాలు తన మనస్సును గాయపరచగా కంసుణ్ణి తప్పు పట్టాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు