నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. భూసురు లాదిగఁ గల జను
లీసుర సేవించిరేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితులగుదురు
చేసెతి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్
భావం: జరిగిన మోసం తెలుసుకొని తాను మద్యపాన సేవనా ప్రియుడైనందువల్ల కచునికి జరిగిన అన్యాయాన్ని రాక్షసులు చేసిన మాయోపాయాన్ని తెలుసుకొని చాలా బాధపడిన శుక్రుడు ఈ విధంగా అంటున్నాడు. నేడు మొదలుకొని బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని పానం చేస్తే పాపమందు తగులుకొని దుర్గతి పొందుతారు. నే నీ కట్టడి చేశాను. ప్రజలు గ్రహించండి. అన్నాడు. నాటి నుంచి నేటి వరకు కూడా మద్యపాన సేవ చేసే వారి వల్ల వారి వారి ఇల్లాళ్లు, బిడ్డలు అనేకానేక కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు. కాని ఈ మద్యపాన సేవనకు బానిసలౌతునే ఉన్నారు. ఇక ఈ శుక్రాచార్యుడు, కచ దేవయానిల వృత్తాంతం విన్న తరువాత నుంచైనా కుల మత జాతి భేదము లేకుండా మద్యపానసేవన చేయకుందురు గాక.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము