నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. జలధిని లోన వీచి విలసత్కలకాంచి సమంచితావనీ
తల పహనక్షమం బయిన దక్షిణ హస్తమునం దదున్నమ
ద్గళ దురుఘర్మవారికణ కష్రుకరాబ్జము వట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుత కీర్తి యయాతి ప్రీతితోన్
భావం: ప్రసిద్ధమైన కీర్తి గల యయాతి సముద్రం యొక్క చలించేతరంగాలనే మధురమైన ధ్వని కలిగిన వడ్డాణంతో కూడిన ధరణీతలాన్ని వహించే శక్తిగల కుడిచేతితో పైకెత్తబడినదియున్నూ అధికమైన చెమటబిందువులతో అందమైనది యున్నూ అయిన దేవయాని పద్మం వంటి చేయి పట్టుకొని నూతినుండి పైకి వచ్చేటట్లుగా ప్రీతితో పైకి తీశాడు. శర్మిష్ఠ తోసివేయగా పాడుపడిన నూతిలో పడిపోయిన దేవయాని దీర్ఘంగా ఆలోచనలో ఉండగా అపుడే అక్కడికి దప్పికతో వచ్చిన యయాతి ఆ నూతి గట్టుపైనే విశ్రమించడం గ్రహించింది. దానితో తనను రక్షించవలసిందిగా కోరింది. అపుడు ఆ యయాతి నీవు ఎవరవని అడుగగా ఆమె తాను శుక్రాచార్యుని కుమార్తెనని తాను పొరపాటున నూతిలో పడినట్లుగాను చెబుతూ తన్ను పైకి తీసి రక్షించమని కోరింది. అపుడు గొప్పఖ్యాతి ఉన్న యయాతి వెనువెంటనే ఆ దేవయాని చేతిని పట్టుకొని నూతినుంచి పైకి రావడానికి సహాయం చేశాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము