నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అలుకమెయి మున్న పలికితి
నలుకని నా పలుకు తీక్షణమై యింతకు ను
జ్జ్వల దహనాకృతిఁ దక్షకుఁ
బ్రేరేప కేల తానెడ నుడుగున్
భావం: శమీకుడను ముని తపస్సు విరమించుకొని బాహ్యస్మృతిలోకి వచ్చి అంతకుముందు జరిగిన వృత్తాంతాన్నంతా తన కుమారునిద్వారా తెలుసుకొంటాడు. ఇక అపుడు పరీక్షిత్తు తనపై వేసిన మృత పాముకళేబరాన్ని చూచి ఆపుకోలేని కోపంతో పరీక్షిత్తునే శపించిన శృంగి ని చూచి పరీక్షిత్తు లోకక్షేమంకరుడు అని అట్టి వానిని శపించడం మంచిదికాదని చెబుతూ నీవు ఇచ్చిన శాపాన్ని మరల్పగలవా అని అడుగుతున్న సందర్భంలో శమీకుని కుమారుడు శృంగి ఇలా మాట్లాడుతున్నాడు. కోపంతో పూర్వమే పలికాను. భయపడని నా మాట తీవ్రమై ఈ పాటికి మండే అగ్ని యొక్క ఆకారంతో తక్షకుడని కలత పొందేట్లుగా ప్రోత్సహింపక తాను ఎందుకు దూరంగా ఉండిపోతుంది? అంటే తక్షకుడిని తప్పక ప్రేరేపిస్తుందని భావం. అంటే శమీకుడు శృంగి చెప్పిన మాట విని తన శిష్యుడైన గౌరముఖుడనువానిని పిలిచి జరిగిన వృత్తాంతమును అంతా పరీక్షిత్తుకు తెలిపి ఆ తరువాత తక్షకుడి వలన జరగబోయే ఆపదను నివారించుకొను చర్యలను తీసుకొనమని రాజైన పరీక్షిత్తు దగ్గరకు శమీకుడు పంపించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము