నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఆయుష్మంతుడవై ల
క్ష్మీయుత! బాల్యంబునంద మీయన్వయరా
జ్యాయత్తమహీభారం
బాయతభుజ! నీవు దాల్చి తభిషిక్తుఁడవై

భావం: దీర్ఘమైన బాహువులు కలవాడా! లక్ష్మితో కూడినవాడా! ఓ జనమేజయా! చిరంజీవివౌ నీవు చిన్నతనమందే అభిషేకింపబడినవాడి వై మీ వంశానికి చెందిన రాజ్యంలో వ్యాపించిన భూమి యోక్క బరువును భరించావు. తక్షకుని వలన ప్రాణాలు కోల్పోయిన పరీక్షిత్తుకు పురోహితులతో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు శాస్త్రాన్ని అతిక్రమించకుండా అతనికి పరలోకంలో ఉత్తమ గతి కల్గించే కర్మలు చేశారు. అని పూర్వ వృత్తాంతాన్నంతా జనమేజయ మహారాజు ఎరిగించారు. జనమేజయుడు తన తాతల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉన్నవాడు కనుక, తన పూర్వులు ఎంతటి ధర్మసంపన్నులో, సద్గుణసమన్వితులో ఇప్పటివారు కూడా తెలుసుకోవాలన్న ఆసక్తితోను పూర్వుల చరిత్రనంతా తాను తెలుసు కోవడానికి ప్రయత్నించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము తెలుసుకోవాలన్న ఆసక్తితోను పూర్వుల చరిత్రనంతా తాను తెలుసు కోవడానికి ప్రయత్నించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము