డైలీ సీరియల్

పూలకుండీలు 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా కుటుంబం పరిస్థితిని కనిపెట్టి ఇంటిస్థలం కాజెయ్యాలనే నన్ను నానా రకాలుగా వత్తిడిచేస్తున్న వీడిప్పుడు డబ్బుల కోసం నాకేం దారి చూపిస్తాడు వీడి పిండాకూడు. నిజంగా అలాంటిదారేదో వీడికి తెలిస్తే అది నాదాకా రానిస్తాడా? అనుకున్న శాంతమ్మ ‘‘ఏంటది?’’ అన్నట్టు అతని వంక చురుగ్గా చూసింది.
‘‘ఇప్పుడు నేను చెప్పే మాట ఎవ్వరికీ చెప్పనని మాటిస్తేగాని చెప్పను మరి’’ ఎందుకోగాని తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి సంశయిస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య.
ఆ మాటలతో మరింతగా అనుమానానికి లోనైన శాంతమ్మ ‘‘ఏంటితను చిత్రంగా మాట్లాడుతున్నాడే!’’ అనుకుంటూ అతని వంక మరింత ఆశ్చర్యంగా చూడసాగింది.
‘‘లేదు చెల్లే! నువ్వనుకుంటున్నట్టు అది చెడ్డమాటేంగాదు.. కాని’’ అంటూ సందిగ్ధంగా ఆపేశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘సరే ఎవ్వరితో చెప్పనే్ల అదేందో దబ్బున చెప్పు’’ పొరపాటున ఆ సమయంలో బస్తీవాళ్ళు ఎవరన్నా ఆ దారిన ఇండ్లకొస్తూ ఇట్లా వంటరిగా వున్న తామిద్దరినీ చూస్తే ఏమనుకుంటారోనన్న భయం గుండె లోతుల్లో ఎక్కడో గుండుసూదిగా గుచ్చుకుంటుంటే మెల్లగా అంది శాంతమ్మ.
‘‘ఇప్పుడు నేను చెప్పబొయ్యేమాట నీకు నూటికి నూరుపాళ్ళు నచ్చితేనే చెయ్యి. లేకుంటే లేదు. అంతేగాదు ఇక్కడి మాటను ఇక్కడే మర్చిపోవాలి సరేనా?’’ ఎవ్వరికీ చెప్పనంటూ శాంతమ్మ ఎంత నమ్మకంగా చెప్పినా అతనిలో ఏదో సందిగ్ధత చచ్చిపోయిన పాము తోకలా ఇంకా కదలాడుతూనే వున్నట్టుగా మాట్లాడాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అతని వాలకాన్ని నిశితంగా గమనించిన శాంతమ్మ ‘‘మొత్తానికి వీడి దగ్గరేదో మతలబే వున్నట్టుంది. అందుకే నేనెంత చెప్పినా నమ్మలేకపోతున్నాడు. వీడసలే పెద్ద పెద్దోల్లదగ్గర డబ్బులు దొబ్బి నాలాగే అవసరాల్లో వున్న ఆడవాల్లని తారుస్తాడని కూడా బస్తీలో జనం గుసగుసగా చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను. కాని, అది నిజమేనేమో! కొంపదీసి వీడు నన్ను గూడా అట్లాంటి పనికి పురమాయిద్దామనుకుంటున్నాడా ఏంది?’’ మనిషికి ఆర్థిక పునాదులు బలహీనంగా వన్నపుడు ఎదురుపడే ప్రతి సన్నివేశం ఓ విధమైన అభద్రతా భావానికి లోను చేస్తుంది. ఫలితంగా ప్రతిదానికీ అనుమానాస్పదంగా ఆలోచించడం అలవాటవుతుంది. అందుకు ఏ మాత్రం మినహాయింపు లేని శాంతమ్మ కూడా తన కడుపులో నుండి పెగిలి వస్తున్న అసహనాన్ని, అనుమానాన్ని బలవంతంగా అదిమి పెట్టుకుంటూ ‘‘అట్లనేగాని అదేందో చెప్పన్నా! అవతల నాకోసం పిల్లలు ఎదురుచూస్తుంటారు’’ సూటిగా అతని ముఖంలోకి చూస్తూ విసుగ్గా అంది.
‘‘ఏం లేదు చెల్లే! హైదరాబాద్‌లో మాకు తెలిసినోళ్ళ బంధువులకొకరికి మస్తు ఆస్తిపాస్తులున్నాయి. కానీ పాపం! వాళ్ళకు పిల్లలు లేరు’’ ఇంకా ఎందుకో ఆవిడ మీద పూర్తి నమ్మకం కుదరనట్టు చెప్పేది చెప్పేది అపి శాంతమ్మ వంక చూస్తూ ఆగిపోయాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అతని మాట తీరును, అతని సందిగ్థాన్నీ చూసిన శాంతమ్మ ‘‘కొంపదీసి వీడు మా చిన్నోన్ని గానీ వాళ్ళకు పెంచుకోను ఇయ్యమనడు గదా!’’ అనుకుని ‘‘ఐతే ఏంది?’’ అతని వంక కళ్ళు విప్పార్చి చూస్తూ గొంతు పెంచి విసురుగా అడిగింది.
‘‘వాళ్ళిప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నారు’’ గారడీవాడు తన బుట్టలో వున్న పామును మెల్లగా బయటకు తీస్తున్నట్టు కొద్ది కొద్దిగా అసలు విషయాన్ని బయటపెడుతూ అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఆ ముచ్చట ఇప్పుడిక్కడ నాకెందుకు చెబుతున్నట్టు!?’’ కొంపదీసి ఇప్పటిదాకా నేననుకుంటున్నట్టే వీడు మా చిన్నోన్ని వాల్లకియ్యమని అడుగడు గదా?’’ అనుకుంటూ అయోమయంగా అతని వైపు చూడసాగింది శాంతమ్మ.
శాంతమ్మ చూపులో చూపు కలిపి చూడలేనట్టు నేల చూపులు చూస్తూ.. ‘‘చెల్లే! నువ్వుగాని నామాటిని కొన్నాళ్ళపాటు హైదరాబాద్ పొయ్యొచ్చావంటే మీ దరిద్రమంతా ఇట్టే తీరిపోద్ది’’ అంటూ మళ్లీ చెప్పడం ఆపేశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘అదేంటి!? హైదరాబాద్ బొయ్యొస్తే మా దరిద్రం తీరిపోవడమేంది!?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది శాంతమ్మ.
‘‘ఔన్నిజం కచ్చితంగా మీ దరిద్రం తీరిపోద్ది. అది చెబుదామనే ఇంతసేపు నీ కోసం ఇక్కడ కూర్చున్నా కొంచెం మనసు పెట్టి విను మరి. అక్కడ నిన్నో ఆస్పత్రికి తీసుకుపొయ్యి ఇంజెక్షన్ చేస్తారు. దాంతో నీకు నెల తప్పుద్ది’’ చెబుతున్న విషయాన్ని ఠక్కున ఆపేసి తన మాటల ప్రభావం శాంతమ్మ మీద ఎలాంటి ప్రతిస్పందనను కలుగజేసిందో పరిశీలించడం కోసం అన్నట్టు ఆమె ముఖం వంక చూశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఏమన్నవ్?’’ అతను అన్నదేంటో తాను విన్నదేంటో సరిగ్గా అర్థం కానట్టు మళ్లీ అడిగింది శాంతమ్మ.
‘‘ఔను, ఇంతకుముందు మనం ఇంజెక్షన్లతోని ఆవులకు, గేదెలకు దూడలు పుట్టడం చూసినట్టే ఇపుడు మనుషులకు కూడా ఇంజెక్షన్లతోని పిల్లలు పుడుతున్నారు. నేను చెప్పినట్టు విని నువ్వు హైదరాబాద్ బొయ్యి ఆ ఇంజెక్షన్ చేయించుకున్నావంటే.. ఇదంతా నీకు కొత్తేమో గాని మన పాల్వంచ సుట్టుపక్కల చాలా రోజుల్నుంచి నడుస్తూనే వుంది.
మనకేదన్నా వస్తువు కావాలంటే జేబులో డబ్బులేసుకొని బజారుకుబొయ్యి రూపాయి అన్నకాడ రెండు రూపాయలు పారేసి నచ్చిన సరుకు కొనుక్కున్నట్టు ఈ రోజుల్లో బాగా డబ్బులున్న ఆలుమగలు కొందరు లక్షలు పారేసి నిరుపేద తల్లుల గర్భాన్ని అద్దెకు తీసుకొని, భర్త వంట్లోంచి తీసిన బీజాన్ని ఆ అద్దె గర్భాల్లోకెక్కిస్తారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు