నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘వెలయఁగ ధర్మాధర్మం
బులు నడపుచు నిఖిల లోక పూజ్యండైని
ర్మలుఁడగు శుక్రుడు వంచిన
నలఘు్భజా! నను వివాహ మగుదే?’ యనినన్
భావం: దేవయాని తనను కాపాడిన నెపాన్ని చూపి తన్నువివాహం చేసుకోమని అడుగుతూ తనతో కూడిన వేయి మంది శర్మిష్ఠతో సహా నీ పరం అవుతారు. మాఅందరితో నీవు ఇలలోకంలో ఇంద్రభోగాలను అనుభవించవచ్చునని చెప్పగా యయాతి మహారాజు ఇది అధర్మయుక్తమైన కార్యం. ఎక్కడైన క్షత్రియులు బ్రాహ్మణ స్ర్తిలను పెళ్లాడుతారా? నేను ఒక రాజును. నేనే అధర్మమైన పనిని చేస్తే వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోతుంది కదా. అదిగాక అన్ని వర్ణాల, ఆశ్రమాల ధర్మాలు సంకీర్ణాలు కాకుండా కాపాడుతున్న రాజునైన నేను ఈఅధర్మయుతమైన కార్యాన్ని చేయను అని అనగా దేవయాని ‘గొప్ప బాహు పరాక్రమం కలవాడా! ప్రసిద్ధమయ్యేట్లుగా ధర్మాన్నీ నిర్ణయిస్తూ సకల లోకాలకుపూజనీయుడవై పాపరహితుడైన నా తండ్రి శుక్రుడాజ్ఞాపిస్తేనన్ను పెండ్లాడుతావా! ’అని దేవయాని యయాతిని అడిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము