డైలీ సీరియల్

యమహాపురి-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశ్వర్ నవ్వి, ‘‘గుడ్ క్వెశ్చన్’’ అన్నాడు. తర్వాత స్వరం కాస్త తగ్గించి, ‘‘మనకి జీతాలిచ్చేది నేతలు కాదు, ప్రజలు. మనకి కావలసింది నేతల సపోర్టు కాదు, ప్రజల దీవెనలు. మనం పద్ధతి పాటిస్తే ప్రజలు మనని దీవిస్తారు. ప్రజల దీవెన మనకుంటే నేతలు మననేం చెయ్యలేరు. ఎందుకంటే నేతలకీ ప్రజల దీవెనలుండాలి. సింపుల్ లాజిక్’’ అన్నాడు.
‘‘లాజిక్ సింపులే కానీ- ఆచరణలో అంత సింపుల్ కాదనుకుంటాను...’’ అన్నాడు శ్రీకర్ సాలోచనగా.
ఈశ్వర్ తల అడ్డంగా ఊపాడు. ‘‘చూడు శ్రీకర్! దేశంలో అవినీతి పేరుకుపోయిందంటారు. ఉత్తర దక్షిణాలుంటే కానీ ఉద్యోగాలు రావంటారు. కట్నమివ్వందే ఆడపిల్లకి పెళ్లి కాదంటారు. ఇదంతా స్వార్థపరులూ, అవకాశవాదులూ, ఆత్మవంచకులూ చేసే ప్రచారం. నిజమెలాగుంటుందో నా మాట విను. పదేళ్ల క్రితం నా చెల్లికి పెళ్లి చేశాం. పైసా కట్నమివ్వలేదు. పెళ్లి ఖర్చు ఉభయపక్షాలూ చెరి సగం చేసుకున్నాం. ఇంతకీ ఆ ప్రపోజల్ కూడా మా నుంచి కాదు, అబ్బాయి వాళ్ల తరఫునించే వచ్చింది.
ఇదొక్కటే కాదు, నాకు తెలిసి గత పదేళ్లుగా అలాంటి పెళ్లిళ్లు ఓ వందైనా జరిగుంటాయి. కానీ కట్నం వేధింపులకున్న ప్రచారం వీటికుండదు. అదలాగుంచితే- ఏ రికమెండేషనూ లేకుండా, ఎవరికీ లంచమివ్వకుండా- స్వయంకృషితో నేనీ ఉద్యోగం సాధించుకున్నాను. నువ్వూ అంతేనని నాకు తెలుసు. మన డిపార్టుమెంటే కాదు, ఈ దేశంలో ఏ డిపార్టుమెంటైనా తీసుకో. అందులో మనలాంటివాళ్లదే మెజారిటీ. ఆ విషయం మనందరికీ తెలుసు కూడా. కానీ ఎవడో ఒకడు అడ్డదార్లో పైకొస్తాడు. దేశమంతటా అదే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ తెలిసిన మనం కూడా అది నమ్ముతాం! వాళ్లనీ వీళ్లనీ కాదు, ముందు మనని మనం నమ్మడం నేర్చుకోవాలి. అప్పుడీ సిస్టం నిండా మనలాంటివాళ్లే కనిపిస్తారు...’’
ఈశ్వర్ ఇంకా ఏదో చెప్పబోయేవాడే- చేతిలో ట్రేతో, ట్రేలో కాఫీ కప్పులతో సీత లోపలికి రాకపోతే...
సీత ఇద్దరి ముందూ చెరో కప్పూ పెడుతుంటే ‘్థంక్స్’ అన్నారు ఈశ్వర్.
సీత చిన్నగా నవ్వి వెళ్లిపోయింది.
‘‘ఇందాకా మీరు రిమోట్ బటన్ నొక్కడం చూశాను. మనిషి వస్తారనీ, కాఫీ చెబుతారనీ అనుకున్నాను. కానీ వాటంతటవే కాఫీలు వచ్చేశాయే..!’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘అదా!’’ అని నవ్వాడు ఈశ్వర్. ‘‘ఇందాకా నొక్కిన బటన్ మనిషిని పిలవడానికి కాదు. ఇక్కడ ఏ గదిలో ఏం జరిగినా స్టేషన్లో మొత్తం అందరికీ తెలిసే ఏర్పాటుందన్నానుగా. ఐతే మాటలు మాత్రం వినిపించకుండా మ్యూట్ చేసే సదుపాయం కూడా ఉంది. వినపడాలనుకున్నపుడు అన్‌మ్యూట్ చెయ్యొచ్చు. అలా సీతకి మనకేం కావాలో తెలిసింది’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ కాఫీ సిప్ చేస్తూ, ‘‘ఒక పోలీస్ స్టేషన్లో ఇంత సోఫిస్టికేషనా? అంతా కలలా ఉంది. నేనొచ్చిన చోట స్టేషన్లో శీతాకాలంలో కూడా ఉక్కకతో ప్రాణం పోతుంది. ఏసీ మాటటుంచి- ఒక బల్బు పాడైతే కొత్తది కొనడానికి కూడా పెద్ద ప్రొసీజరు. తప్పనిసరైతే ఒకోసారి స్వంత డబ్బు కూడా పెట్టాల్సొచ్చేది’’ అన్నాడు.
‘‘ఖర్చుచేసేది ప్రభుత్వం సొమ్మయితే ఆ ప్రొసీజర్సన్నీ ఇక్కడా ఉన్నాయి. కానీ మన స్టేషన్లో టోటల్ ప్రైవేటైజేషన్. అదీ తేడా’’ అన్నాడు ఈశ్వర్.
‘‘పోలీస్ స్టేషన్లో ప్రైవేటైజేషనా? ఎలా’’ అన్నాడు శ్రీకర్ అర్థంకాక.
‘‘ఈ మధురాపురిలో పది కాలనీలున్నాయి. వాటిలో సామాన్యులు, మధ్య తరగతివారితోపాటు ఇనె్వస్టర్లున్నారు. ఇండస్ట్రియలిస్టులున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్థులున్నారు. ఇక్కడికొచ్చిన కొత్తలో నేను ప్రతి కాలనీకి వెళ్లి అక్కడి వారందర్నీ కలుసుకున్నాను. ఒక పోలీసు ఇన్స్‌పెక్టరుగా వారి యోగక్షేమాలకోసం నేనేం చెయ్యగలనో చెప్పాను. విధి నిర్వహణకు ఉన్న ఆర్థికపరమైన ఆటంకాలు వివరించాను. అందుకు నాక్కావాల్సిన సదుపాయాలేమిటో చెప్పాను. వాటిని ప్రజలే సమకూర్చాలని ఒప్పించాను. అంతే ప్రజాధనంతో ఈ స్టేషన్ ఇలా మారిపోయింది’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ తల అడ్డంగా ఊపాడు. ‘‘సంథింగ్ రాంగ్ సార్! ప్రభుత్వం నెలకొల్పిన పోలీసు స్టేషన్ ఇది. దీని నిర్వహణకు అయ్యే ఖర్చు ప్రజాధనంతోనే కదా, సమకూర్చబడుతోంది? అలాంటప్పుడు ప్రజలు మళ్లీ తమ డబ్బుని ఈ స్టేషన్ కోసం ఎందుకు ఖర్చుపెడతారు?’’ అంతా గజిబిజిగా ఉంది నాకు’’ అన్నాడు.
ఈశ్వర్ నవ్వాడు. కాఫీ చివరి సిప్ చేసి కప్పు బల్లమీదుంచాడు. ‘‘దేశంలో దొంగతనాలు పెరిగిపోయాయి. హత్యలు, మానభంగాలు పెరిగిపోయాయి. అల్లర్లు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎన్ని పోలీస్ స్టేషన్లున్నా, ఎంతమంది పోలీసులున్నా ఇవేమీ అదుపు కావడం లేదు. తెలుసు కదా!’’ అన్నాడు ఈశ్వర్.
‘‘ఊ’’ అన్నాడు శ్రీకర్ తనూ కప్పు టేబుల్‌మీద పెట్టి.
‘‘ఏ నగరంలోనైనా- ఎవరు కరడుకట్టిన నేరస్థులో, ఎవరు చిల్లర నేరస్థులో, ఎవరికి నేరం పట్ల ఆకర్షణ కలిగే అవకాశముందో- అన్న విషయంలో చాలావరకూ పోలీసులకు స్పష్టమైన అవగాహన వుంది. ఔనా?’’
‘‘ఊ’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఐనా పోలీసులవల్ల పని జరుగడంలేదు. అందుకని జనం- వాచ్‌మన్లని పెట్టుకుంటున్నారు. సిసి కెమెరాలు పెట్టుకుంటున్నారు. తమ కోసం తామే ఎన్నో రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఐనా ఫలితం మాత్రం కొండని తవ్వి ఎలుకని పట్టినట్లే ఔతోంది. నేరాలు ఆగడంలేదు’’ అన్నాడు ఈశ్వర్. ‘‘ఇవన్నీ నాకు తెలిసినవే. కానీ మీరేం చెబుతున్నారో నాకింకా...’’
‘‘నన్ను పూర్తిగా చెప్పనీ! జనం రక్షణ కోసం మనకంటే ఎక్కువగా దాదాలతో డీల్ కుదుర్చుకుంటున్నారు?’’
‘‘ఇదీ నాకు తెలుసు సార్! కానీ మీరేం చెప్పదల్చుకున్నారో అర్థం కావడంలేదు’’ అన్నాడు శ్రీకర్.

ఇంకా ఉంది