నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. లలితాంగి ! శయన మొక్కడు
వెలిగా రుచిరాన్న పాన వివిధా భరణ
దుల శర్మిష్ఠ కు నిష్టము
సాలయక చేయుమని నన్ను శుక్రుడు వంచెన్

భావం: నన్ను కూడా తల్లిని చేయమని అడిగే శర్మిష్ఠ ను చూచి యయాతి మహారాజు ‘సుందరాంగి వైనా ఓ శర్మిష్ఠా!పడక ఒక్కటీ బాహ్యవౌనట్లుగా రుచిగల భోజన పానీయాలు, పలు విధాలైన అలంకారాలు మొదలైన వాటి చేత శర్మిష్ఠకు వైముఖ్యం పొందకుండా ప్రీతి చేయుమని శుక్రుడు నన్నాజ్ఞాపించాడు’ అని ఆమెతో చెప్పాడు.యయాతి రాజును తన చేతిని పట్టుకున్నందున నీవే నా పతివని దేవయాని వివాహం చేసుకొంది. దానివల్ల ధర్మహాని కలుగకుండా శుక్రుడు వరాన్నిచ్చాడు. దేవయానితోపాటు గా వేయమంది చెలెకత్తియలతో శర్మిష్ఠ యయాతి మహారాజు దగ్గర ఆవాసం చేస్తోంది. కనుక శర్మిష్ఠ తాను కూడా యయాతి నే వివాహం చేసుకోవాలని అనుకొంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము