డైలీ సీరియల్

యమహాపురి 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఐతే సరే! నీకు శశిపాపని పరిచయం చేస్తాను. నీకో కొత్త అనుభవం’’ అన్నాడతడు శ్రీకర్‌కి కన్నుగీటి.
‘‘ఈయన కనె్నందుకు గీటినట్లు?’’ అనుకున్నాడు శ్రీకర్ మనసులో.
అంతలోనే ‘‘ఇప్పుడు మనం హోటల్ డేటీకి వెడుతున్నాం. అలా కాదు- మఫ్టీలో. పక్కనే డ్రెస్ ఛేంజ్‌కి క్యూబికిల్ వుంది. అది మోనిటర్ పరిధిలోకి రాదులే’’ అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు క్యూబికిల్‌లోకి వెళ్లి సామాన్య యువకుల్లా తయారై వచ్చారు.
ఈశ్వర్ వెంటనే క్యాబ్‌కి ఫోన్ చేసి ఎక్కడికి రావాలో వివరాలు చెప్పాడు. తర్వాత శ్రీకర్‌తో, ‘‘పద, మనం ముందు క్యాబ్‌కి చెప్పిన చోటు చేరుకోవాలి’’ అన్నాడు.
***
‘‘ఇక్కడ ఆపు’’ అన్నాడు ఈశ్వర్.
అది హోటల్ డేటీ. ఐదంతస్తుల పెద్ద భవనం. చుట్టూ విశాలమైన స్థలం. అందులో పెద్ద పెద్ద చెట్లు. మధ్యలో పెద్ద ఏరియాలో లాన్. ఆమధ్యలో స్విమ్మింగ్ పూల్. ఒక పక్క అండర్‌గ్రౌండ్ కార్ పార్కింగ్.
డ్రైవర్ కారాపి, ‘‘పోర్టికోలోకి...’’ అనబోయి ఆగిపోయాడు. అప్పటికే ఈశ్వర్, శ్రీకర్ కారు దిగారు. ఈశ్వర్ బిల్లు పేశాక- ఇద్దరూ లోపలకు నడిచారు.
‘‘లోపల అడుగెట్టగానే చల్లగా ఉండే గార్డెన్‌కూడా ఏసి చేసేశారా?’’ అన్నాడు శ్రీకర్ నవ్వుతూ.
‘‘అటు చూడు, తెలుస్తుంది’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ అటు చూస్తే స్విమ్మింగ్ పూల్ గట్టుమీద బికినీల్లో అందాల భామలు నలుగురున్నారు. ఏవో జోక్స్ వేసుకుంటూ వళ్లంతా కదిలిపోయేలా నవ్వుకుంటున్నారు. ‘‘వాతావరణంలో వేడి మొత్తం లాగేసిన హాట్ హాట్ భామలు అక్కడుంటే- ఇక్కడ చల్లగా ఉండడానికి ఏసి అవసరమా?’’ అన్నాడు ఈశ్వర్.
ఇద్దరూ లోపలికెళ్లారు. రిసెప్షన్ వైపు నడిచారు. రిసెప్షన్ కౌంటర్లో ఓ అమ్మాయి కూర్చుని ఉంది. అందంలో, మేకప్‌లో సినీతారలతో పోటీపడే ఆమె చిరునవ్వు చూపరులకి ఏసికి మించిన చల్లదనాన్నిస్తోంది.
‘‘అయాం ఎనీ టైం కస్టమర్. దిసీజ్‌మై ఎటిసి కార్డ్’’ అంటూ ఈశ్వర్ జేబులోంచి ఓ కార్డు తీసి ఆమెకి అందించాడు.
ఆమె ఆ కార్డు చూసింది. ఈశ్వర్‌ని ఎగాదిగా చూసింది. ఆ కార్డుని ఎదుటనున్న మెషీన్లో స్క్రాప్ చేసింది.
‘‘దిసీజ్ అవర్ మెనూ కార్డ్’’ అంటూ అతడికి ఓ ఫోల్డర్ ఇచ్చింది. ఎటిసి కార్డు తిరిగిచ్చేసింది.
ఈశ్వర్ ఆ కార్డ్ తీసుకున్నాడు. ఇద్దరూ వెళ్లి హాల్లో ఓ సోఫాలో కూర్చున్నారు.
శ్రీకర్‌కి మెనూ కార్డ్‌మీద ఆసక్తి లేదు. ఈశ్వర్ ఏం చెయ్యబోతున్నాడా అన్న కుతూహలం తట్టుకోవడం కష్టంగా ఉందతడికి.
‘‘యు డోంట్ మైండ్ పనీర్ నూడుల్స్’’ అన్నాడు ఈశ్వర్ శ్రీకర్‌తో.
‘‘ఇదేం ఐటెమ్? పేరే వినలేదే!’’ అన్నాడు శ్రీకర్.
‘‘పేరెందుకూ- ఐటెమే చూపిస్తాను’’ అంటూ ఈశ్వర్ తన మొబైల్‌లో ఏదో మీట నొక్కి చూపించాడు.
శ్రీకర్ ఉలిక్కిపడ్డాడు. కళ్లు చెదిరే అందంతో, మత్తెక్కించే చూపులతో ఓ అందమైన యువతి.
అర్థంకాక ప్రశ్నార్థకంగా చూస్తే- ‘‘ఎస్ పనీర్ నూడుల్స్’’ అన్నాడు ఈశ్వర్ గంభీరంగా.
‘‘నాకేం అర్థం కాలేదు’’ అన్నాడు శ్రీకర్. కానీ ఏదో అర్థవౌతోంది అతడికి.
‘‘మెనూ కార్డులో ఐటెమ్ పేరుకి నంబరుంటుంది. ఎటిసి కార్డున్నవారికి ఆ నంబరు కోడ్. అదుపయోగించి మొబైల్‌లో ఫోటో చూడొచ్చు’’ అని నెమ్మదిగా శ్రీకర్ చెవిలో చెప్పి, ‘‘డు యు లైక్ ది ఐటెమ్’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ ఔననలేదు. కాదనలేదు. కానీ ఈశ్వర్‌మీద నమ్మకంతో, ‘నెక్స్‌ట్ స్టెప్?’’ అన్నాడు.
ఇద్దరూ రిసెప్షన్‌కి వెళ్ళారు. ‘‘ఐటెమ్ నంబర్ థర్టీన్’’ అన్నాడు ఈశ్వర్ తన ఎటిసి కార్డు ఆమెకిచ్చి.
రిసెప్షనిస్ట్ ఈశ్వర్ ఇచ్చిన ఎటిసి కార్డుని మళ్లీ మెషీన్లో స్క్రాప్ చేసిందిది తన ఎదుట మోనిటర్లో చూస్తూ.
‘‘ఇట్ విల్ బి సెర్వ్‌డ్ ఇన్ రూం నెంబర్ సెవెన్ సర్’’ అని అతడికి ఎటిసికార్డు తిరిగిచ్చేసింది.
అప్పుడే అక్కడికి రూంబాయ్ కాబోలు వచ్చాడు. రిసెప్షనిస్టు అతడికి తాళాలిచ్చింది.
ఏడో నెంబరు గది క్రింద అంతస్తులోనే ఉంది. బాయ్ వాళ్లని రూంకి తీసుకెళ్ళాడు. తలుపు తెరిచి వాళ్లని లోపలకు తీసుకెళ్లి తాళం ఇచ్చి వెళ్లిపోయాడు.
గది విశాలంగా, చల్లగా ఉంది. గదిలో ఓ అధునాతన డ్రాయింగ్ రూంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఈశ్వర్ వెళ్లి రూం తలుపు గడియ పెట్టి వచ్చాక ఇద్దరూ ఓ సోఫాలో పక్క పక్కనే కూర్చున్నారు.
అప్పటిదాకా శ్రీకర్ ఏం మాట్లాడలేదు. కూర్చున్నాక, ‘‘ఐటెమూ, నంబరూ, అమ్మాయి ఫొటో- నాకేమితో అసభ్యంగా అనిపిస్తోంది’’ అన్నాడు.
‘‘నో నో నో - జేమ్స్‌బాండ్ ఫ్యాన్స్ అలా మాట్లాడకూడదు’’ అని నవ్వాడు ఈశ్వర్. నవ్వుతూనే టీపాయ్‌మీద రిమోట్ ఒకటి తీసి ఏవో నంబర్లు నొక్కాడు.
‘‘ఏం జరుగుతుందిప్పుడు?’’ కుతూహలం శ్రీకర్‌ని తినేస్తోంది.
అతడు ఆలోచిస్తూండగానే అతడి ఎదుటనున్న బీరువా తలుపు తెరుచుకుంది. అందులోంచీ ఓ అందమైన అమ్మాయి బయటకు వచ్చింది.

ఇంకా ఉంది

వసుంధర