నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తరుణ ప్రదేశినులు మా
సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ
పిరి తండ్రియు ఁ దల్లియు నని
కర మనురాగిల్లె ఁ గన్యకాని పహంబున్
భావం: ఆ కుమారులు లలితములైన చూపుడు వేళ్ల దీర్ఘాలు కాగా వీరు మా తండ్రి మా తల్లి అని యయాతి శర్మిష్ఠలను చూపించారు. ఆ దృశ్యం చూచి అక్కడి కన్యకలసముదాయం మిక్కిలి ప్రీతిని పొందారు.
చ. పతివిహితానురాగమున భార్గవుపుత్రి యయాతి చేత సం
చితయయి వాఁడు దానవికిఁ జేసిన నెయ్య మెఱింగి కోపదుః
ఖిత యయి తండ్రి పాలి కతి ఖేదమునం జని దీర్ఘ నేత్రని
ర్గత జలధారలం గడిగెఁ గాంత తదీయ పదాబ్జ యుగ్మమున్
భావం: పతి అన్యస్ర్తియం దుంచిన ప్రేమ చేత యయాతి చేత వచించపబడిన దై శుక్రుడి కూతురైన దేవయాని యయాతి రాక్షస కన్యయైన శర్మిష్ఠ యందు చేసిన ప్రేమ కలాపాన్ని ఎఱిగి కోపాన్ని, దుఃఖాన్ని పొందినదై మిక్కిలి శోకంతో తండ్రి వద్దకు వెళ్లి తన దీర్ఘ నయనాల నుండి జారు కన్నీటి ధారల చేత అతని పాదపద్మయుగ్మాన్ని కడిగింది. తండ్రిపాదాలను కన్నీరోడ్చి కడిగిందన్నమాట.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము