నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఋతుమతియై పుత్రార్థము
పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుండై
ఋతువిఫలత్వము సేసిన
యతనికి మఱి భ్రూణ హత్యయగు నండ్రు బుధుల్
భావం: పుష్పవతి యై భర్తను వాంఛించిన భార్యయెడ అనుకూల్యం లేనివాడై ఋతుకాలాన్ని వ్యర్థం చేసిన వాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం అవుతుందని సెలవిచ్చారు. ఏడుస్తూ వెళ్లిన దేవయాని వెంటే యయాతి కూడా వెళ్లి దేవయానిని ఓదార్చుతూ శుక్రుడిని చూచి రాజు నమస్కరించాడు. దేవయాని తన కు అన్యాయం చేసి అధర్మం చేత ధర్మాన్ని న్యూనపరిచి రాక్షస పద్ధతిలో రాక్షసకన్య అయిన శర్మిష్ఠను అనురాగంతో గ్రహించి పుత్ర త్రయాన్ని పొంది నన్ను అవమానించాడు అని డగ్గుత్తితో దేవయాని శుక్రునికి యయాతి చేసిన పాపాన్ని చెప్పింది. శుక్రుడు తన కూతురైన దేవయానికి కంటినీరు పెట్టించాడన్న కోపంతో యయాతి మహారాజు ముసలితనపు బరువుతో పీడింపబడే వాడివి కమ్ము అని శపించాడు. అపుడు చింతితుడైన యయాతి పైవిధంగా శుక్రాచార్యునికి సమాధానం ఇచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము