డైలీ సీరియల్

యమహాపురి - 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా వచ్చి ఉంటే - ఈ అసాధారణ మహిళ - నీ ముందు తనని తాను రా కాండిటేట్ అని చిన్నబుచ్చుకునేది కాదు’’ అంటూ ఆమెకి తనూ చేతులు జోడించాడు.
‘‘అయ్యో! నామీద నాకు నమ్మకమే కాదు, నేనంటే నాకు గర్వం కూడా. శ్రీకర్ లాంటి సాఫ్ట్ మనిషి నోట నా గురించి కాసిని పొగడ్తలు వినాలని- ఏదో అలా అన్నాను. నా జీవితం నాకెంత ఇష్టమంటే- నాకు నూరేళ్లు బ్రతకాలనుంది. మీ నుంచి నాక్కావాల్సిన పొగడ్తలు నాకు దక్కాయి కానీ- మీకంటే చిన్నదాన్ని. నాకిలా చేతులు జోడించి ఆయుక్షీణం చేస్తారా?’’ అంది శశి.
‘‘సారీ’’ అన్నారిద్దరూ ఏకకంఠంతో.
శశి ఏదో అనబోతే- మధ్యలో ఆపి అన్నాడు శ్రీకర్. ‘‘ఇన్‌ఫార్మర్‌గా మీరు నాక్కూడా మీ సహకారం కొనసాగిస్తారు కదూ!’’
‘‘ఆయుక్షీణమైతే అయింది కానీ- ఒక నమస్కారం నా ఆలోచనల్నే శాసిస్తోంది. మిస్టర్ శ్రీకర్! ఈ క్షణం నుంచీ నేను మీకు ఇన్‌ఫార్మేర్నే కాదు. అడ్మయిరర్ని కూడా!’’ అంది శశి.

3
‘‘ఈవేళ భక్తుల రద్దీ ఉన్నట్లు లేదు. జిడ్డు సుబ్బణ్ణి పట్టుకోవడం సులభం కావచ్చు’’ అనుకున్నాడు కానిస్టేబుల్ సుందరం శివగిరి వైపు చూస్తూ.
ఊరి చివర ఉంది శివగిరి. అది ఎత్తయిన కొండ. పైకి ఎక్కడానికి మెట్లున్నాయి. మెట్లెక్కి పైకి వెడితే- ఓ పురాతన శివాలయం వస్తుంది. ఆలయంలో వెలసిన రామలింగేశ్వరుడు అసలు సిసలు భోళా శంకరుడనీ, భక్తుల కోరికలు ఇట్టే నెరవేరుస్తాడనీ ప్రతీతి. ఏ గుట్టమీద ఏ మహిముందోనని జనం ఆశగా తండోప తండగాలుగా వచ్చి స్వామిని దర్శించుకుని తమ కోర్కెలు చెప్పుకుని వెడతారు.
భక్తులు ఏ సమయంలో వచ్చినా ఆలయం తెరిచే ఉండాలని- ఆలయానికి మొత్తం ముగ్గురు పూజార్లని నియమించింది దేవస్థానం. వాళ్లకు కొండమీదనే వసతి ఏర్పాట్లున్నాయి. వాళ్లు షిఫ్టు పద్ధతిలో పనిచేస్తారు.
గుడి దగ్గిర ఉండే బిచ్చగాళ్లకు దానం చేస్తే అదనంగా పుణ్యం వస్తుందని చాలామంది భక్తుల నమ్మకం. ఆ భక్తుల మీది నమ్మకంతో మెట్ల పొడవునా అటూ ఇటూ బిచ్చగాళ్లు కూర్చుంటారు. భక్తులు అన్ని వేళలా రాకపోయినా, ఏ వేళలో వస్తారో తెలియదు కాబట్టి- బిచ్చగాళ్లు మాత్రం అన్ని వేళలా అక్కడే కూర్చుని ఉంటారు.
ఆ బిచ్చగాళ్ళు ఎండకు ఎండరు. వానకి తడవరు. చలికి వణకరు. ఆకలికి తప్ప అన్నింటికీ అతీతులు. భక్తులు వచ్చినపుడు మాత్రం ఆపాదమస్తకం కదిలిపోతూ- ‘అయ్యా, అమ్మా’ అనే కేకలతో, బొచ్చెల్లో నాణేల్ని గలగలలాడిస్తూ, భక్తులకు తమ ఉనికిని తెలియజేస్తారు. ఆ బొచ్చెల చప్పుడు- భక్తులకు చాటింపులా ఉంటుంది. దేవుడికి భక్తుల రాకను తెలిపే జేగంటలా ఉంటుంది.
సుందరం జిడ్డు సుబ్బడి కోసం అక్కడికొచ్చి అరగంటయింది.
జిడ్డు సుబ్బడు చిల్లర దొంగ. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవడం వాడి ప్రత్యేకత. వాడి వళ్లంతా జిడ్డేనని ఎప్పుడో ఎవరో పోలీసాయన జోక్ చేస్తే- అదే వాడి పేరైపోయింది.
నెల్లాళ్ల క్రితం వాడు శంకరి థియేటరు దగ్గిర ఓ పెద్దమనిషిని చూశాడు. ఆయన చొక్కా జేబు ఎత్తుగా ఉంది. కారణం నిండు గర్భిణీలా ఉన్న పర్సు. వాడికి కళ్లు చెదిరిపోయాయి. హస్తలాఘవం చూపించి ఆ పర్సు కొట్టేశాడు. తీరా చూస్తే అందులో క్రెడిట్ కార్డులూ, అడ్రసు కార్డులూ, చిన్న నోట్‌బుక్కూ తప్ప- డబ్బు పైసా కూడా లేదు. అప్పుడు వాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. అందులోని కాగితాలు, కార్డులు ఆ పెద్దమనిషికి చాలా ముఖ్యమైనవై ఉండొచ్చు. పర్సు తిరిగిస్తే సంతోషించి ఈనామివ్వచ్చు- అనుకున్నాడు.
వాడాయన్ని అనుసరించి వెళ్లి, ‘‘ముందు మీరున్నారు. వెనకాల రోడ్డు మీద ఇదుంది. ఇది కానీ మీది కాదు కదా!’’ అని ఆ పర్సు ఇచ్చాడు.
పెద్దమనిషి పర్సు తీసుకుని ఓసారి చెక్ చేసుకున్నాడు. తర్వాత వాణ్ణి ఎగాదిగా చూసి ‘‘నీకు మాటల్లో థాంక్స్ చెబితే చాలదు’’ అంటూ బనీను లోపలికి చెయ్యి పెట్టి తీసి ఓ వెయ్యి రూపాయల నోటు అందించాడు.
‘‘ఓరినీ, పర్సు జేబులోనూ, డబ్బు బనీను లోపలా అన్నమాట! పెద్దమనుషులు కూడా తెలివివీరిపోతున్నారు’’ అనుకున్నాడు వాడు. పైకి మాత్రం మొహమాటం నటిస్తూ, ‘‘ఎందుకు సార్!’’ అంటూనే నోటందుకోబోయాడు.
ఆయన నోటు వెనక్కి లాక్కుని, ‘‘అప్పుడే కాదు’’ అన్నాడు.
వాడు తెల్లమొహం వేశాడు. కానీ మాట్లాడలేదు. ఆయనే మళ్లీ ‘‘ముందు నేను నీకు ఇంత డబ్బెందుకిస్తున్నానో చెబుతాను. నువ్వు వినాలి. ఆ తర్వాతనే ఈ నోటునీది’’ అన్నాడు.
‘‘చిత్రమైన మనిషిలా ఉన్నాడే’’ అనుకుంటూ, ‘‘చెప్పండి సార్!’’ అన్నాడు సుబ్బడు.
‘‘నా డబ్బు పర్సులో ఉండదు. నా పర్సులో ఉండే కార్డ్సు, కాగితాలు అన్నీ డమీవి. ఆ పర్సుని జేబుదొంగల కళ్లు పడేలా పెట్టుకుంటాను. అది పోయినా నాకేమిబ్బంది లేదు. అటెన్షన్ డైవర్షన్- అంటే దృష్టి మళ్లించడం- అందుకన్నమాట! అదలాగుంచితే- నా దగ్గిరెవ్వరూ పర్సు కొట్టేయలేరని నాకు మహా నమ్మకం’’.
‘‘కానీ ఇప్పుడెవరో కొట్టేసారుగా సార్’’ అన్నాడు సుబ్బడు- ఆ ఎవరో తనే ఐనందుకు మనసులో గర్వపడుతూ.
‘‘ఆ కొట్టేసిందెవరో నాకు తెలియదు. కానీ ఒకవేళ కొట్టేసింది నువ్వే అనుకో! నా అంతటివాడి దగ్గిర పర్సు కొట్టేసినందుకు నీకిది ఈనామన్నమాట!’’ అన్నాడు పెద్దమనిషి.

ఇంకా ఉంది

వసుంధర