నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. తగలి జరయు రుజయు దైవ వశంబున
నయ్యెనేని దావాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటి ఁజే
కొండురయ్య యెట్టి కుమతులైన
భావం: ముసలితనమున్నూ, రోగమున్నూ విధివశాన ఎవరికైనా కలిగితేవారు వాటిని అనుభవిస్తారు కాని, ఎవరైనా తెలిసి తెలిసి మరొకరి నుండి కావాలని ఆ రెండింటినీ ఎవరైనా ఎంత బుద్ధి హీనులైనా గ్రహిస్తారా? అని శాపాన్ని అనుభవిస్తున్న యయాతితో కొడుకులైన ద్రుహి, అనువు, తుర్వసుడు అనువారులు పలికారు. ఎందుకంటే యయాతి శాపమిచ్చిన శుక్రుడే మరలా నీ కు దాపురించిన ముసలి తనాన్ని నీ కొడుకుల్లో ఎవరైనా తీసుకొంటే వారి యవ్వనాన్ని నీవు పొందవచ్చు అనే వెసలుబాటును కలిగించాడు. కనుక యయాతీ తన కొడుకులందరినీ దగ్గరకు పిలిపించుకుని నేను శాపవశాన ఇలాముసలి వాడ్ని అయిపోయాను. నాలో ఇంకా ఇంద్రియభోగాలను అనుభవించాలనే కోరిక మిగిలే ఉంది కనుక మీ లో ఎవరైనా ఈ ముసలితనాన్నితీసుకొంటారా అని అడిగితే ఈ ముగ్గురుకొడుకులు పై సమాధానాన్ని ఇచ్చారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము