నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తనయుండు దల్లిదండ్రులు
పవిచినపని సేయఁడేని పలు కెడలోఁజే
కొనఁడేని, వాఁడు తనయుం
డనఁబడునే? పితృధనమున కర్హుండగునే?
భావం: కొడుకు తల్లిదండ్రు లాజ్ఞాపించిన పని చేయకపోతే వారి వాక్యం హృదయంలో అంగీకరించకపోతే అట్టివారు కొడుకు అనబడుతాడా? తండ్రి సొమ్ము కు తగినవాడు అవుతాడా ? కాదు. ధర్మంతెలిసిన యయాతి మహారాజు తన పెద్ద కొడుకును కాదని తనకు శర్మిష్ఠకు పుట్టిన వానిని అందులోను చిన్నవానిని పిలిచి రాజ్యభారం అప్పగించగా చూచిన పురజనులు యయాతిని ఇది ఏ ధర్మం అని అడిగారు. అపుడా యయాతి మహారాజు ఓ పురజనులారా! మీరు చెప్పినది ధర్మమే కాని తండ్రి మాటకాదనే కొడుకులు, తల్లిదండ్రుల మాటలు వినని సంతానం సంతానం అవుతుందా? అట్టివానికి తండ్రి ఆస్తిపాస్తులు కాని మరేదైనాఏవిధంగా వస్తాయి? అని అడుగు సందర్భంలోని పద్యభావం ఇది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము