నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఏమి తపం బొనరించితి
భూమీశ్వర! పుణ్యలోక భోగంబులఁడే
జోమహిమ నను భవించితి
సామాన్యమె శతసహస్ర సంవత్సరముల్

భావం: ఓ మహారాజా! నీవు ఏమి తపస్సు చేశావు? వందవేల యేళ్లు తేజస్సుయొక్క మహాత్త్వం చేత, స్వర్గలోక పుణ్యంచేత స్వర్గాదిలోకాలలోని సౌఖ్యాల ననుభవించావు ఇది అసాధారణం. అని ఇంద్రుడు యయాతి తన కుమారుడికి చెప్పిన నీతివాక్యాలను అన్నింటిని విన్న ఇంద్రుడు పైవిధంగా అన్నాడు. ఇట్లా యయాతి మహారాజు మిక్కిలి శ్రమకోర్చి తపస్సు చేయడం వల్ల వచ్చిన దివ్యలోక సంచారం గూర్చి ఇంద్రుడు పలికేసరికి నిజంగానే కేవలం తన శ్రమ వల్లనే తన ఏర్పరుచుకున్న నియమనిష్ఠలవల్లనే తనకీ దివ్యలోక సంచారం అనుగ్రహించబడిందన్న ఆలోచనలోకి యయాతి జారిపోయాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము