డైలీ సీరియల్

యమహాపురి 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది నిజమో, కాదో కానీ- అతడు స్వామి గురించి తనకేదో చెప్పాలనుకున్నమాట నిజం.
ఈ పేపర్ కటింగ్ తన కివ్వడంలో అతడికి వేరే ఉద్దేశ్యముందా? స్వామి గురించి అతడికేమైనా విశేషం తెలిసిందా? ఈ ఫోటోలో వ్యక్తుల్ని అతడనుమానిస్తున్నాడా? మరి ఆ ఫొటోలో యోగి కూడా ఉన్నాడుగా...
శ్రీకర్ బుర్ర చురుగ్గా పనిచేసింది. నేరస్థులు ఏ ఆపరేషన్ చేసినా వాటిలో కొన్ని డమీవీ ఉంటాయి.
స్వామి అనుచరులు దేశమంతటా ఉన్నారు. వారికాయన తన ఆదేశాల్ని పంపడానికి ఇంటర్నెట్, మొబైల్, ఉత్తరం వగైరాలు ఉపయోగించడు. వారున్న నగరానికి వచ్చి సభ చేస్తాడు. దీవెన పేరిట సభలో కొందరు వ్యక్తుల్ని వేదికమీదకు ఆహ్వానిస్తాడు. ఆ వచ్చిన వారందరూ ఆయన అనుచరులు కారు.
ఆలీబాబా నలభై దొంగలు కథలో- శత్రువులు ఆలీబాబా ఇంటిని పసికట్టి గుర్తుగా ఒక రాత్రి ఆ ఇంటి తలుపుమీద ఇంటూ గుర్తుపెడతారు. మర్నాడుదయం ఆలీబాబా పనిమనిషి మోర్జియానా ఆ ఇంటూ గుర్తు చూసి అనుమానించి ఎందుకైనా మంచిదని చుట్టుప్రక్కల ఇళ్ళన్నింటికీ ఇంటూ గుర్తుపెడుతుంది. తర్వాత శత్రువులు వచ్చి ఇంటూ గుర్తున్న ఆ ఇళ్లలో ఏది ఆలీబాబాదో తెలుసుకోలేక తికమకపడతారు.
స్వామి దీవెనలు పొందిన ఈ ఆరుగురిలో ఎవరాయన అనుచరులో, ఎవరు కారో తెలియక ఇతరులు తికమకపడాలనే స్వామి ఉద్దేశ్యమయుండొచ్చు. మరి యోగి?
యోగి స్వామి అనుచరుడు కాదా? ఐతే ఎలాంటి అనుచరుడు?
శ్రీకర్‌కి రకరకాల మాఫియా నేతల కథలు తెలుసు. వారిలో కొందరికి రెండు రకాల అనుచరులుంటారు. నేరాల్లో భాగస్థులొక రకం. నేతల పట్ల జనాల్లో సద్భావన కలిగించడానికి నియోగించబడ్డవారు రెండోరకం.
యోగిని నేరస్థుడనుకుందుకు మనసొప్పక- శ్రీకర్ అతణ్ణి రెండో రకంలో చేర్చాడు.
యోగి ఉద్దేశ్యం ఏదో వంకన తనకి ఈ పేపర్ కటింగ్ అందజేసి- తనని స్వామి పట్ల ఆకర్షితుణ్ణి చెయ్యడం.
ఆ తర్వాత తన పరిశోధనకు దిగి- ముందుగా యోగి గురించి ఆరా తీస్తే- అతడు సచ్చరిత్రుడని తేలుతుంది. తనకి స్వామిపై అనుమానముంటే అది పోతుంది. కొత్తగా గౌరవం కలుగుతుంది.
‘‘నేనిప్పుడు యోగి గురించి కాక- ఈ పేపర్ కటింగ్‌లో ఉన్న మిగతా వ్యక్తుల గురించి ఆరా తియ్యాలి’’ అనుకున్నాడు శ్రీకర్. అనుకున్నాడు కానీ మరుక్షణమే అతడిలో మరో సందేహం.
యోగి తను లతిక అనే అమ్మాయిని ప్రేమించినట్లు చెప్పాడు. ఆ అమ్మాయి ఊరు నరకపురి అన్నాడు. ఆ ఊరి గురించి కొన్ని విశేషాలు చెప్పాడు.
నరకపురి జోలికి వెళ్లడం పోలీసులకి కూడా ప్రమాదమని ఇన్స్‌పెక్టర్ ఈశ్వర్ తనని హెచ్చరించాడు.
ఇప్పుడు యోగి చెప్పిన వివరాలు వింటుంటే- నరకపురి గురించి అంతగా భయపడక్కరలేదనిపిస్తోంది.
తను స్వతహాగా భయస్థుడు కాకపోయినా, ఈశ్వర్ విజ్ఞతను నమ్మి- నరకపురి గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.
నేరస్థుల్ని పట్టుకోవడంకంటే నేరాల్ని ఆపడం కష్టమైన పని. ఈశ్వర్ సాధించిన వ్యవస్థని- ఈశ్వర్ ఉన్నప్పటి కంటే మెరుగ్గా నిర్వహించే పనుల్లో తలమునకలై ఉన్నారు శ్రీకర్. యోగి వచ్చి అతడిలో మళ్లీ నరకపురి పట్ల ఆసక్తి కలిగించాడు. ‘‘నరకపురి గురించి తెలుసుకోవాలి!’’ అనుకున్నాడు శ్రీకర్.
అఫీషియల్‌గా వాకబు చెయ్యడం శ్రేయస్కరం కాదు. లోపాయికారిగా తెలుసుకుందుకు ఎవరితో మొదలెట్టాలి?
‘‘మన పెంచల్‌కి ఈ చుట్టుప్రక్కల తెలియని సమాచారం లేదు. ఓ ఎన్‌సైక్లోపిడియా అనుకోవచ్చు. ఇనె్వస్టిగేషన్లకి గొప్పగా ఉపయోగపడతాడు’’ అన్న ఈశ్వర్ మాటలు గుర్తుకొచ్చాయతడికి.
‘‘అరే! ఇంతకాలం నరకపురి గురించి పెంచల్రావుని అడగాలని తోచనే లేదే’’ అనుకున్నాడతడు.
తన ముందున్న రిమోట్‌లో ఓ మీట నొప్పి మోనిటర్‌లోకి చూస్తే- తన గదిలో కుర్చీలో కూర్చున్నాడు పెంచల్రావు. ఎవరితోనూ మాట్లాడ్డంలేదు. చాలా శ్రద్ధగా తన చేతి రేఖలు పరిశీలిస్తున్నాడు.
శ్రీకర్ కీబోర్డులో ఏవో మీటలు నొక్కాడు. ‘‘పెంచల్రావ్!’’ అన్న స్వరం వినిపించింది ఆ గదిలో
మరుక్షణం పెంచల్రావు శ్రీకర్ గదిలో ప్రత్యక్షమై సెల్యూట్ చేశాడు.
‘‘ఏం చేస్తున్నావ్?’’ అన్నాడు శ్రీకర్. చెప్పడానికి తటపటాయించాడు పెంచల్రావు.
శ్రీకర్‌కి తెలుసు, పెంచల్రావు ఖాళీగా కూర్చోలేడు. ఎప్పుడూ ఏదో పనిచేస్తుంటాడు. అన్నీ ఆఫీసుకి సంబంధించినవే కావాలని లేదు. కొన్ని చెప్పుకునేందుకు వీలైనవీ కాదు. కానీ ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడినా, ఆఖరికి ప్రాణాలమీదకొచ్చినా కూడా అబద్ధం మాత్రం చెప్పలేడు పెంచల్రావు.
‘‘్ఫర్వాలేదు. నిజం ఏమైనా నిర్భయంగా చెప్పు’’ అన్నాడు శ్రీకర్ అభిమానంగా.
‘‘నా అరచేతిలో రేఖలు పరిశీలిస్తున్నాను సార్!’’ అన్నాడు పెంచల్రావు.
ఫక్కుమన్న శబ్దం వినిపించింది.
నవ్వింది ఆ గదిలో శ్రీకర్ కాదు, హాల్లో వెంకటరత్నం!
ఆ గదిలో జరుగుతున్నది స్టేషన్లో అంతా మోనిటర్‌లోంచి చూస్తున్నారు.
పెంచల్రావు శ్రీకర్‌తో మాట్లాడ్డమంటే- బిగ్ బడ్జెట్ మూవీలో బ్రహ్మానందం సీనులాంటిది. ఆ స్టేషన్లో దాని టిఆర్‌పి రేట్ చాలా హై.
నవ్వు వెంకటరత్నానికే కాదు అందరికీ వచ్చింది. అతడాపుకోలేకపోయాడు. మిగతావాళ్లు ఆపుకున్నారు.
‘‘నీ చేతి రేఖలు నువ్వు చూసుకోవడమేమిటి- ఎవరికైనా చూపించాలి కానీ..’’ అన్నాడు శ్రీకర్ నవ్వుతూ.
‘‘కొత్తగా హస్త సాముద్రికం నేర్చుకున్నాను సార్!’’ అన్నాడు పెంచల్రావు.
‘‘నేర్చుకుంటే వేరెవరి చేతులైనా చూడాలి కానీ, నీ చెయ్యి నువ్వు చూసుకోడమేమిటి?’’
‘‘అలాగే అనుకుని ఒకరికి చూశాను సార్! గొడవయింది’’ అన్నాడు పెంచల్రావు.
పెంచల్రావుకి హస్త సాముద్రికం తెలుసని తెలిసి- అతడి పక్కింటి భద్రం సరదాపడి చెయ్యి చూపించుకున్నాడు.

ఇంకా ఉంది

వసుంధర