డైలీ సీరియల్

యమహాపురి 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకు రెండో సెటప్ వుందని ఊళ్లో పుకార్లే అనుకున్నాను. నీ చేతిలో రేఖలు కూడా చెబుతున్నాయి’’ అన్నాట్ట పెంచల్రావు నిజాయితీగా. అంతే భద్రం ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది.
విషయమేమిటంటే- అప్పటికే భద్రం భార్య ఆయనమీదున్న రెండో సెటప్ పుకార్ల గురించి రోజుకొకసారైనా నిలదీస్తోందిట. ‘‘ఇదిగో ఇప్పుడు అన్నయ్య కూడా చెప్పాడు’’ అంటూ ఆమె భద్రంమీద ఎటాక్ మొదలెట్టింది.
భద్రం ఊరుకోలేదు. ‘‘అసలు నిన్ను హస్త సాముద్రికాన్ని నమ్మమన్నదెవరు?’’ అంటూ తనకి తెలిసి ఎందరి విషయంలో హస్త సాముద్రికం పూర్తిగా ఫెయిలయిందో వరుసగా బోలెడు ఉదాహరణలు చెప్పాడు భార్యకి.
సందు దొరికిందని పెంచల్రావు అంతటితో ఊరుకోవచ్చుగా- ఉహూ...
అతడు భద్రం మాటలు సవాలుగా తీసుకున్నాడు. ‘‘ఎక్కడివో ఉదాహరణ లెందుకమ్మా! నీ చెయ్యిలా పారెయ్. చూసి ఉన్నదున్నట్లు చెబుతాను. తప్పో రైటో నువ్వే తేల్చుకోవచ్చు’’ అన్నాడామెతో..
ఇది విన్న శ్రీకర్‌లో కుతూహలం. ‘‘నువ్వు భద్రం భార్యకి చెప్పినవి రైటయ్యాయా?’’ అన్నాడు.
‘‘ఏదీ, తను చెయ్యి చూపిస్తే కదా! ముందు చెయ్యి చాచిన మనిషే- అంతలోనే ఏమనుకుందో ఏమో- నీ విద్య మీద నాకు నమ్మకమే అన్నయ్యా- అంటూ వెనక్కి లాగేసుకుంది’’ అన్నాడు పెంచల్రావు.
ఫక్కుమన్నాడు శ్రీకర్ ప్రయత్నంగా. ఆ నవ్వుతో మోనిటర్లో మరిన్ని నవ్వులు కలిశాయి.
‘‘మరి ఆ తర్వాత ఇంకెవరికీ చెప్పలేదా?’’ అన్నాడు శ్రీకర్ ఎలాగో నవ్వాపుకుని.
‘‘తెలిసినవాళ్లెవరికి చెబుదామన్నా- భద్రానికి చెప్పావుగా- నీమీద మాకు నమ్మకమేలే అనేవాళ్లే తప్ప చెయ్యిచ్చిన వాళ్లు లేరు. నాకేమో- నా విద్య పరీక్షించుకోవాలని- మహా సరదా! అందుకే వీలైనపుడల్లా నా చేతుల్లో రేఖలే చూసుకుంటున్నాను. మీరు నమ్మకండి, నమ్మకపోండి సార్! నా జీవితంలో జరిగిన కొన్ని విశేషాలు అచ్చుగుద్దినట్లున్నాయి నా అర చేతి రేఖల్లో. ఈ విద్య చాలా గొప్పది సార్!’’ అన్నాడు పెంచల్రావు.
‘‘నిజంగా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఒక్కసారి మీ చెయ్యిలా పారెయ్యండి సార్- నిజానిజాలు మీకే తెలుస్తాయి...’’ ఉత్సాహపడ్డాడు పెంచల్రావు.
శ్రీకర్ సరదాకి చెయ్యి చూపించాలనే అనుకున్నాడు. కానీ అంతలోనే మోనిటర్లో గట్టిగా నవ్వులు వినిపించడంతో- చటుక్కున మోనిటర్లో కామన్ వ్యూ క్లోజ్ చేశాడు.
‘‘చెయ్యివ్వండి సార్!’’ అన్నాడు పెంచల్రావు.
శ్రీకర్ తడబడి, ‘‘ఇప్పడు కాదులే’’ అన్నాడు.
‘‘ఏం సార్? నా విద్య మీద మీకు నమ్మకం లేదా?’’ అన్నాడు పెంచల్రావు నిరుత్సాహపడి.
‘‘నమ్మకం లేకపోవడమా- నీ విద్యని మన ఇనె్వస్టిగేషన్లో ఉపయోగించాలని నేననుకుంటుంటే! అదలాగుంచు. నిన్ను పిలిచిన కారణం వేరే ఉంది. ఈ స్టేషన్లో అందరికీ సీనియర్‌వి కదా- తప్పక తెలుస్తుందని అడుగుతున్నా. మనకి దగ్గిర్లో వున్న నరకపురి అనే ఊరు గురించి నీకేమైనా తెలుసా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నరకపురి గురించి తెలియడానికి సీనియారిటీ ఎందుకు సార్! ఇక్కడికి ముప్ఫై కిలోమీటర్లు సార్- ఆ ఊరు. ఐనా ఆ దిక్కుమాలిన ఊరి గురించి మీకెందుకు సార్?’’ అన్నాడు పెంచల్రావు.
ఇంతవరకూ నరకపురి గురించి ఈశ్వర్ నుంచి విన్నాడు. యోగి నుంచి విన్నాడు. ఇప్పుడు పెంచల్రావు తనకా ఊరి గురించి తెలుసనగానే
ఉత్సాహం పుట్టింది శ్రీకర్‌లో.
‘‘అదేంటీ, అలా అనేశావ్! ఏ ఊరైనా దిక్కుమాలినదెందుకౌతుంది?’’ అన్నాడు కుతూహలంగా.
పెంచల్రావేదో చెప్పబోగా మోనిటర్ నుంచి అలర్ట్ రావడంతో ఆగమన్నట్లు చెయ్యి చూపాడు శ్రీకర్.
మోనిటర్లో సుందరం కనిపించాడు. అప్పుడే స్టేషన్‌లోకి వచ్చాడు. అతడి పక్కన ఓ యువకుడున్నాడు.
ఆ యువకుడెవరో శ్రీకర్‌కి తెలియలేదు. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాడు.
సుందరం ఆ యువకుణ్ణి లాకప్ రూంలోకి తీసుకెళ్లి అక్కడ సెల్‌లో ఉంచి తాళం పెట్టి బయటకు వచ్చాడు.
ఇప్పుడు సుందరం తన రూంకొస్తాడనీ- అందుకు తను గ్రీన్‌సిగ్నల్ పంపాలనీ శ్రీకర్‌కి తెలుసు.
శ్రీకర్ పెంచల్రావుతో, ‘‘నాకు నరకపురి గురించి పూర్తి వివరాలు కావాలి. నీకు తెలిసిన వివరాలన్నీ ఓ కాగితంమీద వ్రాయి. ఒక్కటి కూడా వదలకూడదు సుమా! వ్రాయడం అవగానే నాకు మెసేజివ్వు’’ అన్నాడు.
పెంచల్రావు వెళ్లిపోయాడు. శ్రీకర్ సుందరానికి గ్రీన్‌సిగ్నల్ పంపాడు.
మరుక్షణం సుందరం శ్రీకర్ రూంలో ఉన్నాడు. శ్రీకర్‌కి సెల్యూట్ చేశాడు.
శ్రీకర్ అతణ్ణి ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘అప్పూని బుక్ చేశాం సార్!’’ అన్నాడు సుందరం.
‘‘అప్పూ అంటే- జయదేవ్ టిఫిన్ సెంటర్?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఊ’’ అన్నాడు సుందరం.
‘‘గుడ్ వర్క్! కానీ ఎలా?’’
సుందరం చెప్పసాగాడు.
***
అదో సిటీ బస్‌స్టాప్. బస్సులొస్తున్నాయి. వెడుతున్నాయి.్ప స్టాప్‌లో ఉన్నవాళ్లలో కొందరు బస్సులెక్కుతున్నారు. వాళ్లకి కొత్తవాళ్లు జతపడుతున్నారు.
బస్‌కోసం ఎదురుచూస్తున్నవాళ్లలో డజనుమంది అమ్మాయిలున్నారు. అరగంట నుంచి ఎదురుచూసినా వాళ్లకి కావాల్సిన బస్సు వచ్చినట్లు లేదు.
బస్‌స్టాప్‌లో ఓ మూలగా నిలబడి ఉన్నాడు అప్పూ. అతడక్కడ బస్సుకోసం ఉన్నాడనిపించదు. మాటిమాటికీ ఆ అమ్మాయిల్నే చూస్తున్నాడు. మార్చి మార్చి ఒక్కొక్కళ్లనే చూస్తూ మధ్య మధ్య తన చేతిలో మొబైల్ చూస్తున్నాడు.
బస్‌స్టాపులో అతడిని పట్టించుకున్నవారు లేరు.
చివరికి ఆ అమ్మాయిలెక్కాల్సిన బస్సు వచ్చేసింది. వాళ్ళు బస్సెక్కగానే నిట్టూర్చాడు అప్పూ. ఆ నిట్టూర్పులో మరో నిట్టూర్పు కలిస్తే ఉలిక్కిపడి వెనక్కి చూస్తే- ఓ అమ్మాయి అతడి వెనుకనుంచీ ముందుకొచ్చింది.

ఇంకా ఉంది

వసుంధర