డైలీ సీరియల్

యమహాపురి -37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చామనచాయ రంగు. ముదరాకుపచ్చ పరికిణి. నల్ల జాకెట్టు. లేత నీలం ఓణీ. జుట్టు బాగా బిగించి జడ వేసుకుంది. కళ్లనిండా అమాయకత్వం. చూడగానే పట్నం వాసన ఆట్టే తెలియని పల్లెటూరి పిల్లలా ఉంది.
ఆమె అతణ్ణి చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.
అప్పూ ఆశ్చర్యపోయాడు. ఆ పల్లెటూరి అమ్మాయి నవ్వు అంత మనోహరంగా ఉంటుదనుకోలేదతడు.
తనూ నవ్వి, ‘బస్ కోసమా?’ అన్నాడు.
ఆమె తల అడ్డంగా ఊపి, ‘‘ఆ పార్కు చూద్దామని వచ్చాను. ఒక్కత్తినీ వెళ్లడానికి భయంగా ఉంది’’ అంది ఎదురుగా వున్న పార్కు చూపిస్తూ. ఆమె మాటలో పల్లెటూరి యాస స్పష్టంగా తెలుస్తోంది.
అప్పూ మనసులో చిన్న ఆశ పుట్టింది. ‘‘తోడుగా నేను రావచ్చా?’’ అన్నాడు.
‘‘ఊ’’ అంది ఆమె వెంటనే. ఇద్దరూ రోడ్ క్రాస్ చేసి అవతల పక్కనున్న పార్కులోకి వెళ్ళారు.
ఈలోగా ఒకసారి అప్పూ భుజాలు ఆమె భుజాలకు రాసుకున్నాయి. ఆమె మాట్లాడలేదు.
పార్కులో జనం పలచగా ఉన్నారు. నాలుగైదు చెట్లు, అక్కడక్కడ పూల మొక్కల పొదలు ఉన్నాయి.
‘‘అక్కడ కూర్చుందాం’’ అందా అమ్మాయి ఓ పూల మొక్క పొదని చూపిస్తూ.
చూడబోతే పల్లెటూరి అమ్మాయిలా వుంది. అపరిచితుడైన అబ్బాయితో ఇంత చొరవ చూపిస్తోందేమిటని అప్పూకి అనుమానం వచ్చింది. కానీ అతడి ఆలోచనల్లో వేడి ఉంది. ఆ వేడికా అనుమానం మెత్తబడిపోయింది.
ఇద్దరూ పొద వెనుక కూర్చున్నాక, ‘‘నా పేరు అప్పూ. నీ పేరు?’’ అడిగాతడు.
‘‘చంద్రి’’ అందామె.
‘‘ఒక్కతెవీ పార్కులో నాతో ఇలా కూర్చుందుకు భయమెయ్యడంలేదా?’’ అన్నాడు అప్పూ.
‘‘లేదు. అందుకు కారణాలు రెండు. ఒకటి- నువ్వు చాలా పెద్దమనిషివి’’ అంది చంద్రి.
‘‘నేను పెద్దమనిషినా? అలా ఎందుకనిపించింది నీకు?’’ అన్నాడు అప్పూ.
‘‘ఎందుకంటే?’’ అని చెప్పాలా కూడదా అన్నట్లు ఓ క్షణం తటపటాయించింది. తర్వాత నెమ్మదిగా, ‘‘మా ఊళ్ళో ఓ గ్రంథాలయముంది. అందులో మంచి మంచి పిల్లల కథల పుస్తకాలున్నాయి. అవి చదవడానికి నేనక్కడికి వెళ్ళేదాన్ని. గ్రంథాలయాన్ని చూసే కుర్ర గుమస్తా ఒకడున్నాడు. ఒకసారి వాడు నాకు ఇంకా మంచి పుస్తకాలున్నాయనీ, ఎవరూ లేనప్పుడు చూపిస్తాననీ అన్నాడు. అందరూ ఉండగా చూపిస్తే- అంతా ఎగబడి ఆ పుస్తకాలు లాగేసుకుంటారన్నాడు’’ అంది.
అప్పూ వింటున్నాడు.
ఆ కుర్ర గుమాస్తా ఆమెకు చూపించింది బూతు బొమ్మల పుస్తకం. ముందు ఛీ అంది కానీ తర్వాత చంద్రి కూడా చూడ్డానికి ఉత్సాహపడింది. బొమ్మలు చూస్తుండగా ఆ గుమాస్తా ఆమె భుజంమీద చెయ్యి వేశాడు...
ఆ దృశ్యం గుర్తుకొచ్చింది కాబోలు, ‘‘పాడు వెధవ. పాడు బుద్ధులు’’ అంది చంద్రి.
ఉత్సాహంగా వింటున్న అప్పూ ముఖం అదోలా అయిపోయింది. ‘‘ఓ మగాడితో కలిసి అలాంటి పుస్తకం చూడ్డం నీ తప్పు. ఆ గుమస్తాననడం సరికాదు’’ అన్నాడు.
‘‘అలాంటి పుస్తకాలు అబ్బాయిల దగ్గర కాకపోతే అమ్మాయిల దగ్గిర దొరుకుతాయా? ఈ వయసులో అలాంటివి చూడ్డం ఓ సరదా! చూస్తే తప్పేమిటి? ఎటొచ్చీ వాడలా చెయ్యడమే తప్పు’’ అంది చంద్రి.
‘‘ఈ వయసులో - ఆడపిల్లని పక్కనెట్టుకుని అలాంటి పుస్తకం చూస్తుంటే అలా చెయ్యాలనిపించడమూ సహజం. అది తప్పుకాదు’’ అన్నాడు తన తప్పుకి పునాది వేసుకుంటూ.
‘‘ఏయ్- నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావు. నాకు నచ్చలేదు’’ అంది చంద్రి.
‘‘సమర్థించక ఏం చెయ్యను? ఆ పరిస్థితుల్లో నేనూ అలాగే చేసేవాణ్ణేమో అనిపిస్తోంది. పాడు వెధవ, పాడు బుద్ధులు అన్నావే- ఆ మాటలు నాకే తగిలాయి మరి..’’ అన్నాడు అప్పూ.
చంద్రి నొచ్చుకుని ‘‘అయ్యో-నీకలా అర్థమైందా? నీకూ వాడికీ పోలికేమిటి? వాడేమో సినిమాల్లో కమెడియన్లా ఉంటాడు. నువ్వేమో హీరోలాగున్నావు’’ అంది చంద్రి.
అప్పూ ఛాతీ ఉబ్బింది. ‘‘్థంక్యూ’’ అన్నాడు.
‘‘నేనే నీకు థాంక్స్ చెబుతాను. ఇందాకా నువ్వు మొబైల్లో చూస్తున్నావే- అది నాక్కూడా చూపిస్తే...’’ అంది చంద్రి కొంచెం మొహమాటంగా.
అప్పూ ఉలిక్కిపడి, ‘‘ఏమన్నావ్?’’ అన్నాడు.
‘‘అసలు నిన్ను పార్కుకి తీసుకొచ్చిందందుకే!’’
‘‘అసలు నేనేం చూస్తున్నానో నీకు తెలుసా?’’ అన్నాడు అప్పూ అనుమానంగా.
‘‘అప్పుడు నేను నీ వెనుకే ఉన్నాను. ఏం చూస్తున్నావో తెలిసింది గానీ- స్పష్టంగా కనిపించలేదు. చూడాలని సరదా పుట్టింది. ఆ తర్వాతేం జరిగిందో నీకు తెలుసు’’ అంది చంద్రి.
అప్పూ నిశే్చష్టుడయ్యాడు. బయట అమ్మాయిల్ని చూస్తూ, మొబైల్లో పోర్న్ సైట్స్ చూడ్డం అతనికి సరదా. సౌండ్ రాకుండా మ్యూట్ చేస్తాడు. అతడేం చూస్తున్నాడో ఆ అమ్మాయిలకి తెలియదు. అదో మజా!
తనేం చూస్తున్నాడో ఎవరికీ తెలియదనుకున్నాడు. కానీ ఎలా చూసిందో ఈ పల్లెటూరి పిల్ల చూసేసింది. చూడ్డమే కాదు, తనూ చూస్తానంటోంది, అది తనతో కలిసి. చూపిస్తే థాంక్స్ చెబుతానని కూడా అంటోంది.
పిల్ల వేడిమీదున్నట్లుంది. అంతో ఇంతో అనుభవమూ ఉన్నట్లుంది. ఇలాంటివి బాగా మరిగినట్లుంది.
ఇలాంటి అవకాశం తనకి రావచ్చని కలలో కూడా అనుకోని అప్పూ ఆమెని తేరిపార చూశాడు. ఫ్యాషన్ తెలియక మెరుగులు పడలేదు కానీ- పిల్ల అందగత్తే! సానబెడితే కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రం కాగలదామె.
‘‘ఈ మొబైల్‌తో సానబెట్టాలి’’ అనుకుంటూ మొబైల్ ఆన్ చేసి, ‘‘కలిసి చూద్దామా?’’ అన్నాడు.
‘‘ఊ’’- అది అంగీకారంలా లేదు. వరంలా అనిపించింది అప్పూకి.
అతడు మొబైల్ తన అరచేతిలో ఉంచాడు. ఆమె తన ఎడమ చేతిని ఒడిలో ఉంచుకుంది. వీడియో చూడ్డానికి అతడివైపు వంగి- కుడి చేతిని నేల మీద ఆన్చింది.

--- ఇంకా ఉంది

వసుంధర