నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్తకోకిల
‘నీతదర్థమ కాఁగ దేవ వినిర్మితం బిది, యన్యులు
ర్వీత లేశ్వర ! దీనిఁ జేయరు వింటి మేము పురాణ వి
ఖ్యాత మాద్యము’ నావుడున్ విని కౌరవ వస్తవ్రరుండు సం
జాత నిశ్చయుఁ డయ్యెనప్పుడు సర్పయాగము సేయఁగన్
భావం: ‘రాజా! జనమేజయా! ఈ సర్పయాగం నీ కొరకే దేవతల చేత కల్పింపబడింది. ఇతరులు దీన్ని చేయరు, మేము విని ఉన్నాము. ఇది పురాణాలలో ప్రసిద్ధం, ప్రాచీనమైనది’ అని ఋత్వికులు పలుకకగా విని కౌరవశ్రేష్ఠుడైన జనమేజయుడు అప్పుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించాడు. జనమేజయుని కోరిక విన్న వారు ఎంతో సంతోషంగా తాము విన్న, పురాణాల్లో ఉన్న సర్పయాగం గురించి జనమేజయునితో చెప్పారు. నీవు కౌరవ ప్రముఖులల్లోశ్రేష్ఠుడవు. నీవే ఈ యాగం చేయడానికి అర్హత ఉన్నవాడివి అని వారందరూ కలసి జనమేజయునికోర్కెను ఏవిధంగా తీర్చుకోవాలో చెప్తారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

-శిరంశెట్టి కాంతారావు