నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. బాల హరిణములఁబట్టెడు
లీలను విషమాటవీ చలిత కేసరి శా
ర్దూలేభ శరభముల ఁదన
లాలత్వమునంద యెగిచి పట్టుచు మఱియున్
భావం: ఆ దుష్యంతుడు తన చిన్నతనంలోనే లేడి పిల్లలను పట్టుకొనేవిధంగా దుర్గమ మైన అడవుల్లో తిరుగాడే సింహాలను, పులులను, ఏనుగులను శరభమృగాలను వెంటాడి పట్టుకొంటూ సాగుతూ ఉంది. దుష్యంతుడు రాబోయే రోజుల్లో మహారాజు అవుతాడని ఆయన అత్యంత ధైర్యసాహసాలు కలవాడని చెప్పడానికి చెప్పినఈ పద్యం భావికథార్థ సూచికగా కనిపిస్తుంది. దుష్యంతుడు ఎంత ధైర్యవంతుడో పరాక్రమవంతుడో చెప్పడానికి ఈ పద్యభావం సహకరిస్తుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము