డైలీ సీరియల్

యమహాపురి- 49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది రాణివల్ల కాదు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్న ఆమెకి జగదానందస్వామి దీవెన లభించిది.
***
‘‘బాప్‌రే! ఎక్కడో అంగారక గ్రహానికి వెళ్లి అక్కడి విశేషాలు తెలుసుకొస్తున్నాం. ఈ భూమీద మనూరికి కాస్త పక్కన ఇలాంటి కథ ఒకటి ఉండొచ్చని ఊహక్కూడా తట్టదు. నువ్వు చెప్పిందంతా నిజమైతే కనుక ఈ భూమీద నిన్ను రక్షించగల శక్తి ఎవరికీ ఉండదనిపిస్తోంది’’ అని నిట్టూర్చింది వసంత.
‘‘నా కథ విని రాజా అన్నాడూ- ‘నా మేనత్తకి నేను, నా కుటుంబమే- బానిసలం. మీ ఊళ్ళో యమకి ఊరు ఊరంతా బానిసలు. మనలాంటి ఇద్దరు బానిసల్ని జంటగా పిలిచి- సమాజానికి మేలు చెయ్యమని దీవించడంలో జగదానందస్వామి అంతరార్థమేమిటో!’’ అంది రాణి.
‘‘ఔను. మొత్తం వ్యవహారమంతా తిరకాసుగా ఉంది’ అంది వసంత.
‘‘మా ఊళ్లో ఫోన్లు నిషిద్ధం కాబట్టి నాకు మొబైల్ లేదు. కానీ రాజా నంబరిస్తే నోట్ చేసుకుని ఉంచుకున్నాను. మర్నాడు పేపర్లో జగదానందస్వామి సభ గురించిన వార్త, దీవెన పొందిన ఆరుగురి ఫొటోలూ వచ్చాయి. అవి నేను చూశాను. ఆ విషయం పంచుకోవాలని- హాస్టల్నించి రాజాకి ఫోన్ చేశాను. అప్పుడు రాజా పోలీసులనుంచి పారిపోతూ పరుగెడుతూ బాగా ఆయాసపడుతున్నాడు. పేపర్లో తన ఫొటో వచ్చిందని చెప్పగానే, ఆ ఫొటో ఆధారంతో పోలీసులకి తన ఆచూకీ తెలుస్తుందని బాగా భయపడ్డాడు. గాంధీ పార్కు తెలుసా అనడిగి అర్జంటుగా నన్నక్కడికి రమ్మన్నాడు. నాకా పార్కు తెలుసు. అక్కడికెళ్లి రాజాని కలుసుకున్నాను’’ ఆగింది రాణి.
‘‘ఆ తర్వాత?’’ అంది వసంత.
‘‘తర్వాతమేమయిందంటే..’’ చెప్పడం మొదలెట్టింది రాణి.
***
‘‘రమ్మనగానే వచ్చావు. చాలా థాంక్స్’’ అన్నాడు రాజా రాణీతో.
రాణి అతడికి స్వామి దీవెన వార్త ఉన్న పేపరు ఇచ్చింది. రాజా అది తీసుకుని అందులో వార్త చదివాడు. ఫోటోలన్నీ చూసి, ‘‘ప్రింట్ క్వాలిటీ బాగుంది. చాలా స్పష్టంగా ఉన్నాయి’’ అన్నాడు. తన ఫొటోని శ్రద్ధగా చూసి, ‘ఇది చూస్తే- ఒక్కసారి చూసినవాడు కూడా నన్ను అతి సులభంగా గుర్తుపట్టేయొచ్చు. భగవంతుడా! నాకిప్పుడేది దారి?’ అని స్వగతంలా అన్నాడు.
శివగిరి వద్ద ఏం జరిగిందో రాణికి తెలియదు. కానీ అతడు బాగా డిస్టర్బ్ అయినట్లు గ్రహించింది. అందుకే తను మాట్లాడకుండా అతడినే మాట్లాడనిచ్చింది.
అతడు మాట్లాడ్డం ఆపేక, ‘‘మన పరిచయం చాలా చిత్రంగా జరిగింది కదూ!’’ అందామె.
‘‘నీకు చిత్రంగా ఉంది. నాకు భయంకరంగా ఉంది’’ అన్నాడు రాజా చటుక్కున.
రాణి నొచ్చుకుంది. చిన్నబుచ్చుకుంది. ఏదో అందామనుకుని మాట్లాడకుండా ఊరుకుంది.
తనేమన్నాడో గ్రహించడానికి రాజాకి కొద్ది నిముషాలు పట్టింది. ఆ వెంటనే ‘అయాం సారీ! భయంకరం అంటే ఐ డోండ్ మీన్ యూ. నా అనుభవాల గురించి అన్నాను’’ అన్నాడు.
రాణి మాట్లడలేదు. అంత తక్కువ పరిచయంలో తమ పరిచయాన్ని భయంకరం అనడాన్ని- ఓ ఆడపిల్లగా ఆమె ఇంకా తట్టుకోలేకపోతోంది.
‘‘చాలా తక్కువ పరిచయంలో - నువ్వు నాకు తెలిసినవారందరికంటే ఆప్తురాలివనిపిస్తోంది. అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఈ రోజేం జరిగిందో చెబుతాను. అది వింటే నువ్వు నన్ను అర్ధం చేసుకుంటావు’’ అన్నాడు రాజా.
ఏదో మామూలు సంజాయిషీ అనుకుని అనాసక్తంగానే వినడానికి సిద్ధపడింది రాణి. అనుకోకుండా రాజా ఓ బిచ్చగాడి చావుకి కారణమై, పోలీసుల్నించి పారిపోయొచ్చాడని తెలిసి, ‘ఓ మై గాడ్’ అందామె అప్రయత్నంగా.
‘‘నీకు గాడ్ యమ. ఆయన్ని గుర్తుచేసుకునేందుకిదా సమయం?’’ అన్నాడు రాజా. అప్పటికి అతడి ముఖంలో కాస్త నవ్వు తొంగి చూసింది.
‘‘అయాం సారీ! ఇంత జరిగిందని నాకు తెలియదు. ఇప్పుడేం చెయ్యాలి?’’ అంది రాణి.
‘‘ఏం చెయ్యాలో తెలియడంలేదు. బయట పోలీసులు తరుముతున్నారు, ఇంటికెడదామంటే...’’
రాణి అతణ్ణి మధ్యలో ఆపి, ‘‘ఇంటికెళ్లొద్దు. మీ అత్తయ్య నిన్ను పోలీసులకి పట్టివ్వడం ఖాయం’’ అంది.
‘‘మంచిదో, చెడ్డదో- చిన్నప్పట్నించి చేరదీసి నన్నింతవాణ్ణి చేసింది అత్తయ్య. ఈ రోజు నన్ను తనే పోలీసులకి పట్టిస్తుందా?’’ అన్నాడు రాజా.
‘‘ఒక్కసారి ఆలోచించు. నీ అత్తయ్య నీ కోసమని ప్రత్యేకంగా ప్రసాదం తయారుచేసిచ్చింది. ఊరి చివరికి వెళ్లి తినమని చెప్పింది. ఆ ప్రసాదం విషం కలిసిన మాట నిజం కదా! అది తిని నువ్వు చస్తావనీ- ఊరి చివర కాబట్టి నీ శవం ఏ కుక్కల పాలైనా కావచ్చనీ ఆమె అనుకుని ఉంటుంది. నిన్ను చంపాలనుకున్న నీ అత్తయ్య- నువ్వింటికి వెడితే పోలీసులకి అప్పగించకుండా ఉంటుందా?’’ అంది రాణి.
‘‘పరిస్థితుల్ని బట్టి చూస్తే- ప్రసాదంలో విషం అత్తయ్యే కలిపి ఉండాలనిపిస్తోంది. కానీ అలా అనుకుందుకు నాకు మనస్కరించడం లేదు. ఆమె మా నాన్నకి స్వయానా అక్క. నాన్న పోతే తనకి తానుగా పిలిచి మాకు ఆశ్రయమిచ్చింది. నేనింతవాణ్ణయ్యాక ఇప్పుడు నన్ను చంపాలని ఎందుకనుకుంటుంది? హత్యకి మోటివ్ ఉండాలిగా? నా అభిప్రాయంలో అత్తయ్య చెడ్డది కావచ్చు. హంతకురాలు కాలేదు’’.
‘‘నీ సెంటిమెంటుని ప్రశ్నించను కానీ- ఇప్పుడు ఇంటికెళ్లడం మాత్రం నీకు సేఫ్ కాదు’’ అంది రాణి.
‘‘అలా అనుకుంటే- నన్నింకో భయం వేధిస్తుంది. అంతో ఇంతో సంపాదించి అత్తయ్యకి బాకీ చెల్లు వేస్తున్నాను. నేనున్నప్పుడే ఆ ఇంట్లో అమ్మకీ, తమ్ముడికీ దినదినగండంగా ఉండేది. మరి నేను లేకపోతే అత్తయ్యకి వాళ్లిద్దరూ గుదిబండలు. అత్తయ్య నన్ను చంపాలనుకున్నమాట నిజమైతే- ఇప్పుడా ఇంట్లో అమ్మ, తమ్ముడు ఏమైపోతారా?’’ వాపోయాడు రాజా.
‘‘నిజంగానే నీ పరిస్థితి భయంకరంగా ఉంది’’ అంది రాణి జాలిగా.
‘‘పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. నా కారణంగా ఓ బిచ్చగాడు చచ్చిపోయాడు. ఆ హత్యానేరంలో నేనిరుక్కున్నాను.

ఇంకా ఉంది

వసుంధర