భక్తి కథలు

హరివంశం 141

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సభలో అప్పుడు శ్రీకృష్ణ, బలరాముల కుమారులు, వృద్ధమంత్రులు, మహారాజ్య హిత చింతకులైన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. దివ్య కిరీట విరాజితుడు, కౌస్త్భు వక్షాలంకృతుడు, పయోదకాంతి కలిత నీలాంబరుడు, కనకాంబరుడు, స్ఫారేంద్రధను వనమాలావిభూషితుడు, జలజాక్షుడు, జగదీశుడు, మందహాస సుందరుడు అయిన కృష్ణప్రభువును మునీశ్వరులు దర్శించి మనఃప్రీతి పొందారు.
వాళ్ళందరూ తమ తమ సముచితాసనాలలో ఆసీనులైన తర్వాత ‘మీ క్రతు కలాపం, వే
ఇంకా ఉంది దాధ్యయనం, దీసోదీక్ష, లోకశుభంకర వ్రతాచరణం నిర్విఘ్నంగా సాగుతున్నాయా? నా పట్ల అనుగ్రహంతో మీరంతా ఇపుడు ఏ పనిమీద వచ్చారు. అందరూ కలిసి రావటం నా మహద్భాగ్యం అని వారిని ప్రశంసించాడు కృష్ణుడు. ఏ పనిమీద వచ్చారో, దానిని నాకు ఆజ్ఞాపించండి. దానిని నెరవేర్చి నేను కృతకృత్యుణ్ణి అవుతాను. మీ అనుగ్రహం పొంది ఆనందిస్తాను అని కృష్ణుడు వారికి కృతాంజలి అయినాడు.
ఈ మాటలకు వారు తమ కష్టాలు తీరినట్లే, కోరికలు ఈడేరినట్లే హృష్టులైనారు. తాము బదరీవనం తెచ్చిన రేగుపండ్లు తమ శిష్యుల హస్తాలనుంచి తాము సంగ్రహించి యదుకుల స్వామికి ప్రీతిపూర్వకంగా సమర్పించారు. తరువాత తమ ఫాల భాగాల చేతులు జోడించారు. ‘దేవా! నీవు పూర్వం బదరికావనంలో నరనారాయణాత్మకుడివై నరుడితో కూడిన తపస్సు చేశావు.
అప్పుడు ఈ రేగుపండ్లను ఆరగించావు. మళ్లీ వాటిని రుచి చూపించటానికి తెచ్చాము, స్వీకరించు. ఇక మేమందరం నీ దర్శనం ఎందుకు చేయటానికి వచ్చామంటే, ఆ పని నీవల్ల అవశ్యం కావలసి ఉంది. దానిని ఇతరులెవరూ నిర్వహించలేరు. ఆ పని ఏమిటో చెపుతున్నాం విను. నరకాసురుడనే ఘోర రాక్షసుడు విజృంభించి లోకాలను పీడిస్తున్నాడు. వాడు భూదేవికి జన్మించాడు. బ్రహ్మవల్ల దేవతలవల్ల అవధ్యుడయ్యేట్లు వరం పొందాడు. ఇంద్రుడికి హడలు పుట్టించి అమరావతి నుంచి పారద్రోలాడు. సిద్ధసాధ్య యక్ష వర్గాలవారు వాణ్ణి చూసి కంపించిపోతున్నారు. ఈ రాక్షసుడి భయానక ఔద్ధత్యం చూస్తూ ఉంటే వీడు సముద్రాలనైనా పానం చేయగలడేమో! ప్రళయకాల నలుడిలాగా సమస్త చరాచరాలను భస్మీపటలం చేయగలడేమోననిపిస్తున్నది. ఎవరిని ఏ విధంగా హింసించాలా? అని లోకాలన్నిటినీ వాడు గాలిస్తున్నాడు.
అదే వాడికి అన్నిటికన్నా గొప్ప వినోదం. కాబట్టి వాడు బదరీ వనానికి కూడా వచ్చాడు. మేము యజ్ఞాలు హోమాలు చేసుకుంటూ ఉంటే సహించలేకపోయినాడు. ఎవరా దేవతలు? ఎందుకీ యజ్ఞాలు. యజ్ఞాలు చేయదలిస్తే ఆ క్రతుఫలం నాకు చెందేట్లు, నన్నుద్దేశించి చేయండి అని మూర్థించాడు. మేము అట్లా వల్లకాదనేప్పటికి, ఇక మా పాట్లు పాట్లు కావు. నానా ధ్వంసం సృష్టించాడు. మా ఆడవాళ్ళను కూడా పరాభవించాడు.
మా ముని కన్యలను కొందరిని ఎత్తుకొని పోయినాడు. ఇక మేము అనదలమై దిక్కూ తెరువూ తోచక నీవే దిక్కు అని నిన్ను ఆశ్రయించటానికి వచ్చాము. దేవకీ నందనా! మూడు లోకాలను రక్షించటానికే కదా నీవు అవతారమెత్తావు! నరకుడు మాకిప్పుడు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. వాడి పాపాన్ని ఉపేక్ష చేస్తే లోకాలన్నీ రూపరిపోతాయి అని ఆ ఋషులు, మునులు నిశ్శ్వాసాకుల వదనులైనారు.
ఇట్లా వాళ్ళు తమ దీన గాథలు చెప్పేటప్పటికి పరమ పురుషుడు చింతాక్రాంతుడైనాడు. విషణ్ణుడైనాడు. పట్టలేని ఆశ్చర్య, విభ్రమాలకు గురి అయినాడు. నోట మాట రాక నిశే్చష్టుడైనాడు.

ఇంకా ఉంది