నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదవెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయు గరికర శీతల చ్ఛాయదచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్వాసపడి దాని జెంది సుఖం బున్న సింహములయు
భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి పెట్టు నీవారాలన్న పెండతతులు
గడంగి భక్షింప నొక్కట గలపియాడు చున్న
యెలకులు బిల్లుల యొండులయు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు
సూచి ముని శక్తి కెంతయు జోద్యమంది
భావం: చెవుల పండువుగా చిలుకలు సామవేదాన్ని సస్వరంగా పాడే పద్ధతులలో ఆసక్తి పొంది తన్మయత్వంతో కదలకుండా వింటున్న ఏనుగున్నూ ఏనుగులతొండాల చల్లని నీడలలో వాటి నీటి తుంపురులు చల్లని గాలి పై ఆశపడిదాన్ని పొంది సుఖంగా ఉన్న సింహాలున్నూ, బ్రాహ్మణశ్రేష్ఠులు భూతబలులు తెచ్చి వివిధ ప్రదేశాల్లో నీవార ధాన్యపు అన్న పిండాలను ఉంచగా వాటిని తినాలని వేగిరపడుతూ ఒకచోట కలసి మెలసి తిరుగుతున్న ఎలుకలున్నూ పిల్లులున్నూ అవి తమతమ మధ్య పరస్పరం సహజంగా ఉన్న వైరి స్వభావం గల వర్గాలైనప్పటికిన్నీ కలసిమెలసి మసలే వాటి స్నేహప్రవృత్తిని చూచి ముని మహిమకు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు దుష్యంతుడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము