నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. క్రచ్ఛఱ వేఁట యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందు బోయిరొకొ బా?’ రనినన్ విని యాలతాంగి‘వా
రిచ్చట నుండి రుూ క్షణమ యేఁగిరి కానకుఁ బండ్లు దేర మీ
వచ్చు టెఱింగిరేని జనవల్లభ! వారును వత్తురింతకున్’

భావం: ‘వినోదంగా వేటకు వచ్చి కణ్వ మహామునిని దర్శించుకొని పోదామని ఇక్కడకు వచ్చాను వారు ఎక్కడికి పోయినారో కదా?’ అని దుష్యంతుడు అడుగగా లతాంగి అయిన శకుంతల ఇట్లన్నది : ‘వారు ఇక్కడి నుండి ఇంతకుముందే (ఈక్షణమే) పండ్లు తేవటానికి అడవిలోకి వెళ్లారు. మీ రాక వారికి తెలిస్తే ఓ రాజా! వారు కూడా ఇప్పుడే తిరిగి వస్తారు’ అని ఇంద్రుని కుమారుడైన జయంతుని సౌందర్యంతోపోల్చదగిన దుష్యంతుని సౌందర్యాన్ని చూచిన కణ్వ మహాముని కూతురైన శకుంతల తొట్రుపాటుతో అతిథి మర్యాదలు చేస్తూ పై విధంగా అడిగింది. శకుంతల దుష్యంతునికి ఆసనం ఆర్ఘ్యంపాద్యం లాంటివి ఇస్తూ యోగక్షేమాలను అడిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము