నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘జగతివల్లభ !యే న
త్యగణిత ధర్మస్వరూపు ఁడని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం
దగు కణ్వ మహామునీంద్రు నాత్మజ’ ననినన్

భావం: ‘‘ఓ ప్రభువా! అపారమైన ధర్మమే రూపం దాల్చిన వాడని ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండగా లోక పూజ్యుడై ఉన్న కణ్వ మహామునీంద్రుడి కూతురిని నేను ’’ అని శకుంతల - వేట నిమిత్తం వచ్చి చాలా సేపు వేటాడడం వల్ల మిక్కిలిగా అలసిపోయి సేద దీరుదామని తన పరివారాన్ని వదిలి దూరంగా మరో ప్రక్కకు వచ్చిన దుష్యంతునికి సహజ వైరి లక్షణాలను కూడా మరిచిపోయి స్నేహమాధుర్యంతో ఉన్న జంతుజాలమూ కాలాతీతంగా పూసే పూవులతోనిండి ఉన్నవనమూ కనబడింది. ఈ ఆశ్రమం కణ్వమహాముని దై ఉంటుందని దుష్యంతుడు అనుకొన్నాడు. ఒకసారి ఆ మహానుభావుడిని దర్శించుకొందామని ఆ ఆశ్రమంలోకి వచ్చాడు. అక్కడ కణ్వ మహాముని కూతురైన శకుంతల కనబడి దుష్యంతునకు అతిథి మర్యాదలు చేయగా దుష్యంతుడు మిక్కిలి ఆశ్చర్యంతో ఆమె వివరాలు అడిగాడు. అపుడు ఆ శకుంతల తాను ధర్మమే రూపుగా కలిగిన కణ్వుని కూతురనని చెప్పింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము