నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. వనజ భవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
న్వననిధిలోన ముంచిన యవారి తసత్త్వుడు నిన్నుఁ దొట్టి రుూ
యనిమిషులెల్లవానికి భయంపడుచుండుదు రట్టి యుఘ్రకో
పసుకడ కిప్పుడేఁగు మని పాడియె యిప్పని నన్ను ఁబంపఁగన్
భావం: బ్రహ్మ మహిమ వంటి మహిమగల వసిష్ఠుడిని సైతం పుథ్ర శోక సాగరంలో ముంచినవాడు ఆ అనివార్య తేజస్వి విశ్వామిత్రుడు. నీవు మొదలుకొని దేవతలందరూ ఆ మహర్షి అంటే భయపడుతూ ఉంటారు. అట్టి భయంకర కోప స్వభావుడి పాలికి ఈ పనిమీద ఇప్పుడు నన్ను పొమ్మని చెప్పటం న్యాయం కాదు.విశ్వామిత్రుడు వసిష్ఠుని మీద కోపంతో తాను కూడా బ్రహ్మర్షి పదవి పొందాలని తీవ్ర మైన తపస్సును సాగిస్తున్నాడు. పైగా రాజర్షి పదవిని కూడా తపస్సు చేత పొందినవాడు. అటువంటి తపశ్శాలి దగ్గరకు మేనకను పొమ్మనే దేవేంద్రుని చూచి విశ్వామిత్రుడు ఏదైనా శాపం ఇస్తే తనకు రక్షణ ఉండదని మేనకను పొమ్మని చెప్పడం ఏవిధంగా భావ్యమని మేనక దేవేంద్రుని అడుగుతున్న సందర్భం.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము