నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అంబుజలోచన గని విన
యంబున నమ్మునికి మ్రొక్కి యనురాగముతో
డం బుష్పావచయ వ్యా
జంబున విహారించుచుండె సఖులుం దానున్
భావం: పద్మనేత్ర అయిన మేనక వినయంతో విశ్వామిత్రుడికి నమస్కరించి, ప్రీతితో పూలుకోసే నెపంతో చెలికత్తెలూ తానూ విహరిస్తూ ఉన్నది .
చ. అలసత యొప్పుఁగా దరుణి యమ్మునిపల్లభుమ్రోల నున్న స
మ్మిళిత సుగంధలంధురస మీరవశంబునఁ దూలి బాలపై
పలువెడలన్ బయల్పడియె వల్దకుచంబులుఁ గక్షయుగ్మమున్
లలితకృశోదరంబుఁ దరళత్రివళీయుత రోమరాజియున్
భావం: మేనక అలసభావం తోవగా ఆ ఋషి శ్రేష్ఠుడి ముందట ఉండగా, మంచివాసనతో కూడికొన్న గాలి వలన కోమలి పైట తొలగి తొలగిపోయింది. అప్పుడు ఆమె పెద్దవైన వక్షోజాలూ, కోమలమైన సన్నని నడుమూ మెరిసే కడుపుమీది మూడు మడతలతో కూడిన నూగారూ బయటపడ్డాయి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము