డైలీ సీరియల్

యమహాపురి 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ఉద్యమమైనా విజయం సాధించాలంటే అందుకు త్యాగాలు అవసరం. ఈ ఉద్యమంలో మనకి ప్రాణభయముంది. కానీ అది యమ వచ్చేక! ఈలోగా మనం మరికొన్ని చిన్న చిన్న త్యాగాలు చెయ్యాల్సి ఉంటుంది’’ అన్నాడు రాజా ఆమెతో.
రాణి అతడి కళ్లలోకి చురుగ్గా చూసింది. ‘‘ఇదంతా నువ్వు నాకెందుకు చెబుతున్నావో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేముందే నేనో నిర్ణయానికి వచ్చాను. ఇక్కడికొచ్చేక ఆ నిర్ణయం బలపడింది.
ఈ ఉద్యమం కోసం నేను నా చదువుని తాత్కాలికంగా త్యాగం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నీకు- నిన్నర్థం చేసుకుని ఈ ఉద్యమానికి సహకరించే ఈ ఊరి మనిషి తోడు కావాలి. ఆ తోడు నేనౌతాను. మనని జంటగా దీవించడంలో స్వామి ఉద్దేశ్యం కూడా అదేనని నాకిప్పుడర్థవౌతోంది. యమ వచ్చేదాకా నేనిక ఈ ఊరొదిలి వెళ్లను’’ అంది.
‘‘్థంక్స్ రాణీ! నువ్వు నా మనసులోని మాట బాగా అర్థం చేసుకున్నావు’’ అన్నాడు రాజా.
రాణి అదోలా నవ్వి, ‘‘యమ తిరిగొచ్చేక నా భవిష్యత్తేమిటా అని- దిగాలు పడి ఉన్న నన్ను జగదానందస్వామి దీవెన కొంత ఉత్సాహపరిచింది. ఆ తర్వాత నీ పరిచయం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అప్పట్నించీ ఆ దీవెనను ఎలా సద్వినియోగం చెయ్యాలా అని అదేపనిగా ఆలోచిస్తున్నాను.
అందుకే స్వామి దీవెన పొందిన వారొకొక్కరి గురించే ఆరా తీశాను. వారిలో ఒకడు యోగి అనే యువకుడు. అతగాడు ఇన్స్‌పెక్టర్ శ్రీకర్‌ని కలుసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకర్ భార్య వసంత నన్ను కలుసుకుందుకు వచ్చింది. అంటే- ఈ ఉద్యమంలో మనకి తెలియకుండానే యోగి కూడా తన పాత్ర నిర్వహిస్తున్నాడు. మిగతా ముగ్గురూ కూడా మనకి తప్పక ఉపయోగపడతారనే ఆశతో వాళ్ల వివరాలు కూడా సేకరించాను. మనం ఎప్పుడైనా సరే వాళ్లని కాంటాక్ట్ చెయ్యొచ్చు’’ అంటూ అవినాష్, సుధాకర్, ఉషల వివరాలు చెప్పింది.
రాజా సాలోచనగా, ‘‘యు ఆర్ రియల్లీ గ్రేట్ రాణీ! వీళ్లు మనకి బాగా ఉపయోగపడతారు. మనవల్ల కాని పని కొంత వీళ్లవల్ల ఔతుంది. సమయం చూసి ఇక్కడకు రప్పిద్దాం’’ అన్నాడు.
రాణి యమకి కాబోయే ఉంపుడుకత్తె అని గ్రామస్థులకి తెలుసు. వారి దృష్టిలో అదో గొప్ప హోదా. యమకి అంతలా వచ్చిన మనిషి ఇప్పుడు రాజాకి తోడుగా నిలవడంతో- ఊళ్ళో రాజా విలువ మరింత పెరిగింది.
అక్కణ్ణించి చకచకా పనులు జరిగిపోయాయి. ఊళ్ళోనూ, యమ ఇంట్లోనూ కూడా గ్రామస్థులకి బానిసత్వం నుంచి విముక్తి లభించింది. సేవకులు జంతువుల్లా కాక మనుషుల్లా జీవించడం మొదలైంది.
యమ అనుచరులు, బంధుజనం- సామాన్య జనంతో కలిసిపోయారు. వారం రోజుల్లో ఇంటింటా కరెంటు, గ్యాసు సదుపాయాలు వచ్చాయి. రెండు వారాల్లో ఊళ్ళోకి టీవీ సదుపాయం వచ్చిందది.
ఇంటికో టీవీ. ఆ టీవీల్లో ఎక్కువగా భక్తి ఛానెల్సూ, పాత సినిమాలూ!
ఇంటింటా వంటింట గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్రిజ్ వంటి ఆధునిక సదుపాయాలు!
గ్రామంలో సేవకులకి వారం వారం జీతాలు! రైతుల పంటకూ, వృత్తి పనులవారి చేతలకూ- తగిన మూల్యం! వృద్ధులకూ, వికలాగులకూ భత్యం ఏర్పాటు!
యమ ఇంట్లోని ఆహార ధాన్యాల్నీ, ఇతర వస్తువుల్నీ చౌక ధరలకు సరఫరా చేసే దుకాణాలు వెలిశాయి. రాజా తలచుకుంటే- దేనికి కొదువ. యమ కోశాగారం ఒక తరగని నిధి అతడి అధీనంలో వుంది.
రెండు వారాల్లో ఆ ఊరి స్వరూపం పూర్తిగా మారిపోయింది.
అప్పటికి సమయం వచ్చిందని- బయట్నించి అవినాష్, సుధాకర్, ఉషలను ఊళ్ళోకి రప్పించాడు రాజా.
ఆ ముగ్గురికీ నరకపురి జీవన విధానం తెలియదు. యమ నియంతృత్వ పాలన గురించి తెలియదు. రాజా వారికి యమ గురించి పెద్దగా చెప్పలేదు. పైగా ఆకాశానికి ఎత్తేశాడు.
‘‘మనం దేవుణ్ణి దేవుడిలా చూడం. ఈ గ్రామస్థులు యమని దేవుడిలా భావిస్తారు. వాళ్లు ఆయనపై చూపించే భక్తిముందు- హనుమంతుడి రామభక్తి కూడా వెలవెలబోతుంది. కానీ యమ అందుకు సంతోషించడం లేదు. వాళ్లు భక్తి పేరిట తనకి బానిసలైపోతున్నారని బాధపడుతున్నాడు.
వాళ్లు హనుమంతుడిలా తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు. ఆ పని తనవల్లకాదని తను విదేశయాత్రకు వెళ్లిన సమయంలో- నన్నిక్కడికి తన ప్రతినిధిగా పంపాడు. ఇక్కడి జనంలో మానసిక వికాసం కలిగించే బాధ్యత నాకు అప్పగించాడు. ఆ బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను.
ఎందుకంటే మనమందరం కలిసి జగదానందస్వామి దీవెన పొందినవాళ్ళం. ఈ మహత్కార్యాన్ని నిర్వహించడానికే ఆ దీవెన మనకి లభించిందని నా నమ్మకం’’ అని రాజా వారికి చెప్పాడు. యమని దేవుడని నమ్మే జనాన్ని ఆ భావనే ఆధారంగా చేసుకుని ఆకట్టుకోవాలనీ, అందుకు భారీగా పారితోషికం ముడుతుందనీ కూడా రాజావారికి చెప్పాడు. ఆ తర్వాత-
అవినాష్- పాపపుణ్యాలు, మంచిచెడ్డలు, ధార్మిక జీవనం వగైరాలపై జనాకర్షకంగా ప్రసంగాలిచ్చి- జనాల్లో అర్థవంతమైన ఆధ్యాత్మిక భావాన్ని కలిగించాడు.
సుధాకర్ తన మిమిక్రీ వెంట్రిలాక్విజమ్ విద్యలతో వినోదం కలిగించి జనాల్ని అపూర్వంగా అలరించాడు.
ఉష మారుతున్న సమాజంలో మానవత్వపు విలువలు, పౌర హక్కులు, జాగృతి వగైరాల గురించిన ఉపన్యాసాలతో ప్రజల్ని చైతన్యం దిశలో ఆలోచింపజేసింది.
ఆ ముగ్గురికీ- యమ ప్రాంగణంలో వసతి, విందు- జీవితంలో ఎరుగనంత వైభవంగా ఏర్పాటయ్యాయి.
క్రమంగా ఊళ్ళో కొత్త ఉత్సాహం. కొత్త జీవం. కొత్త కళ.
పండుగలొచ్చినా, వేడుకలొచ్చినా ఊరంతా కలిసి జరుపుకుంటున్నారు.
రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. యమ నరకపురి తిరిగొచ్చే రోజు దగ్గిరపడుతోంది.
రాజాకి ఏం చెయ్యాలో తోచడం లేదు.

ఇంకా ఉంది

వసుంధర